
Skin Care Tips for Winter: చలికాలంలో స్కిన్ పొడిబారకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి
ఈ వార్తాకథనం ఏంటి
వణుకు పుట్టించే చలి.. చలికాలంలో చర్మంపై తీవ్ర చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి వివిధ రకాల క్రీములను వాడి ఇబ్బందులకు గురవుతారు.
విపరీతమైన చలి వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోయి, పొడిబారినట్లు మారుతుంది.
అందుకే చలికాలంలో చర్మ సంరక్షణపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చర్మంపై శ్రద చూపకపోతే అందవిహీనంగా మారే అవకాశం ఉంటుంది. కావున చలికాలంలో చర్మ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
మార్కెట్‌లో లభించే క్రిములు, ఆయిల్స్ వాడడం వల్ల చాలా డబ్బులు ఖర్చు అవుతాయి.
అలాంటి సమయంలో కొబ్బరి నూనెను చర్మానికి సంరక్షించడానికి ఉపయోగిస్తే మంచిది.
ముఖ్యంగా పాలలోని మీగడను, వెన్నను, నెయ్యిని శరీరానికి రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
Details
స్మానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి
చలికాలంలో నీటిని తాగడంపైన ఎక్కువ దృష్టి పెడితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
కనీసం నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉన్నవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇటువంటి వారు ఉదయం సూర్యరశ్మి తగిలేలా శరీరాన్ని చూసుకోవాలి.
ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే విటమిన్ డీ త్రీ టాబ్లెట్‌లను వైద్యుల సూచనల మేరకు ఉపయోగించాలి.
స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది.
ఇందులో విటమన్ ఇ, చియా గింజలు, ఫ్యాటీ ఆమ్లాలు, లావెండర్ నూనెలు ఉన్న మాయిశ్చరైజరనే ఎంచుకోవాలి.