
ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నీషియం ఇంకా చాలా పోషకాలు ఉంటాయి.
ప్రస్తుతం గుమ్మడి విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
గుమ్మడి విత్తనాల్లో ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి కారణంగా శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల వయసు పెరగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే క్యాన్సర్, ఆల్జీమర్స్ మొదలగు వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొవ్వును తగ్గించే గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాల్లో మంచి కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొవ్వును తొలగించి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చూసుకుంటుంది.
Details
రోగ నిరోధక శక్తిని పెంచే గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. అలాగే రక్తంలోని చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది.
ప్రొస్టేట్ సమస్యలను తగ్గిస్తుంది:
50-75 ఏళ్ల మధ్య వయసు గల వారిలో సాధారణంగా వచ్చే ప్రోస్ట్రేట్ సమస్యను గుమ్మడి విత్తనాలు తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
మెనోపాజ్ దశ దాటిన తర్వాత మహిళల్లో వచ్చే గుండె సంబంధిత సమస్యలను గుమ్మడి విత్తనాలు తగ్గిస్తాయి. గుమ్మడి విత్తనాలను ఏ విధంగా తినాలి? గుమ్మడి విత్తనాలను డైరెక్ట్ గా తినవచ్చు.
కావాలంటే వాటిని పెనం మీద వేయించి కూడా ఆరగించవచ్చు. అలాగే ఓట్ మీల్, పెరుగు మొదలగు వాటిపై జల్లుకుని తినవచ్చు.