టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి
ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహార సంప్రదాయం ఉంటుంది. కొన్ని దేశాల్లో బియ్యంతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. మరికొన్ని దేశాల్లో గోధుమతో చేసిన ఆహారాలను తింటారు. ప్రస్తుతం టర్కీ దేశంలో ఏయే ఆహారాలు మీ నోటికి రుచిని అందిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. మాంసం తినని వారికోసం కేవలం వెజిటేబుల్స్ ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. కిజర్తమా ఈ ఆహారంలో ఫ్రై చేసిన కూరగాయలు ఎక్కువగా కనిపిస్తాయి. బంగాళదుంప, దోసకాయ, ఎగ్ ప్లాంట్స్ మొదలగు వాటిని ఆలివ్ ఆయిల్ లో ఫ్రై చేస్తారు. ఆ తర్వాత పాలకూర, వెల్లుల్లి, టమాట, ఆలివ్ ఆయిల్ తో కలిపి చేసిన సాస్ ని ఫ్రై చేసిన ఆహారం మీద వేస్తారు. అంతే.
టర్కీలో టేస్ట్ చేయాల్సిన వెజిటబుల్స్ ఆహారాలు
సిగ్ కోఫ్టి: కారంగా ఉన్న టమాటా సాస్ లో బల్గర్ బాల్స్ ని నానబెడతారు. టమాటా సాస్ ని బల్గర్ బాల్స్ పీల్చుకున్న తర్వాత పాలకూర ఆకులు, నిమ్మ చెక్కలు, దానిమ్మ గింజలతో సర్వ్ చేస్తారు. ఈ ఆహారం చాలా ఆరోగ్యకరమైనదని అక్కడి ప్రజలు చెబుతారు. శాక్షుకా: ఈ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఎగ్ ప్లాంట్స్, బంగాళదుంప, టమాటాలు ఉంటాయి. ఈ మూడింటిని టమాట, ఉల్లిపాయ సాస్ లో బాగా వేయించాలి. ఆ తర్వాత పెరుగుతోపాటు అవతల వారికి సర్వ్ చేయవచ్చు. యాప్రక్ సర్మ: బియ్యము వేయించిన ఉల్లిపాయల మిశ్రమం చుట్టూ వైన్ లీవ్స్ చుట్టి ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.