LOADING...
Motivation: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే.. భార్యభర్తలిద్దరూ కలిసి ఇవి చేయొద్దు!
దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే.. భార్యభర్తలిద్దరూ కలిసి ఇవి చేయొద్దు!

Motivation: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే.. భార్యభర్తలిద్దరూ కలిసి ఇవి చేయొద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను విశదీకరించారు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు ఇప్పటికీ కోట్లాది మంది అనుసరిస్తున్నారు. ముఖ్యంగా సమస్యల నుంచి బయటపడటానికి, సుఖశాంతులతో జీవించడానికి ఆయన సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. దాంపత్య జీవితం విషయంలోనూ చాణక్యుడు స్పష్టమైన సూత్రాలను చెప్పారు. భార్యాభర్తలు కలిసి చేయకూడని కొన్ని పనులను ఆయన ప్రత్యేకంగా హెచ్చరించారు.

Details

ఏ పనులు చేయకూడదో చూద్దాం

1. ఒకేసారి ధ్యానం చేయకూడదు చాణక్యుడి ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ కలసి ధ్యానం చేస్తే పరధ్యానంలో పడే అవకాశం ఎక్కువ. అందువల్ల ధ్యానం వేర్వేరుగా చేయాలని ఆయన సూచించారు. 2. కలిసి చదువుకోవద్దు పాఠాలు చదివేటప్పుడు శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కానీ భార్యాభర్తలు కలిసి చదివితే దృష్టి మరలిపోతుందని చాణక్యుడు అంటారు. కాబట్టి, చదువుకునేటప్పుడు వేరువేరుగా కూర్చోవడమే మంచిది.

Details

3. బట్టలు మార్చుకోవడంలో జాగ్రత్త

చాణక్యుడి ప్రకారం, భార్యాభర్తలు ఒకరి ముందు ఒకరు బట్టలు మార్చుకోవడం సరికాదు. అలాగే, స్త్రీలు బట్టలు సరిచేసుకుంటున్నప్పుడు పురుషులు చూడటం కూడా మంచిదికాదు. ఇది దాంపత్య జీవితంలో అప్రతికూలతలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల చాణక్యుడి సలహా ఏమిటంటే - ధ్యానం, చదువు, బట్టలు మార్చుకోవడం వంటి పనులు ఎప్పుడూ విడివిడిగా చేయాలి. ఒకేసారి కలసి చేయడం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.