Page Loader
Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు
సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రం ఈ సమయంలో విదేశీ పక్షులతో సందడిగా మారింది. మధ్య ఆసియా, సైబీరియా, తూర్పు యూరప్ వంటి ప్రాంతాల నుంచి అడవి, వైడర్‌ జాతి పక్షులు ఇక్కడ చేరుకుంటున్నాయి. వాటిలో చాలా పక్షులు మంచు గడ్డ కట్టే సమయంలో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉప్పలపాడు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. 1980లో బాపట్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన మృత్యుంజయరావు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు విదేశీ పక్షులను గుర్తించారు. ఆయన గ్రామ రైతుల సహకారంతో ఎనిమిది ఎకరాల చెరువును అభివృద్ధి చేశారు. ఈ చెరువులో పక్షులు గుడ్లు పెట్టేందుకు, పిల్లలను ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టాండ్లు ఏర్పాటు చేశారు.

Details

పక్షుల ఆవాస కేంద్రంగా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షుల విడిది కేంద్రాలలో, పక్షులు సాధారణంగా ఆరు నెలలకు మించి ఉండవు. కానీ ఉప్పలపాడులో అనుకూల వాతావరణం కారణంగా 27 రకాల పక్షులు ఎక్కువ కాలం ఇక్కడే విడిది చేస్తాయి. ఈ ప్రత్యేకతతో దీనిని అరుదైన పక్షుల ఆవాస కేంద్రంగా గుర్తించారు. 2002లో అటవీ, పర్యాటక శాఖల సహకారంతో ఈ ప్రాంతంలో టవర్, రైలింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం రూ. 3 కోట్లు ఖర్చు చేసి ఈ కేంద్రాన్ని విదేశీ పక్షుల విడిది కేంద్రంగా అభివృద్ధి చేసింది.