
స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రెండ్ షిప్ డే.. ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశం, బంగ్లాదేశ్, ఇంకా ఇతర కొన్ని దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని దేశాలు వేరువేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
అలాగే ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డేని జులై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇండియాలో మాత్రం ఆగస్టు నెల మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్ షిప్ డేని జరుపుకుంటారు.
స్నేహితుల దినోత్సవం చరిత్ర:
ఫ్రెండ్ షిప్ డేని మొదటిసారిగా హాల్ మార్క్ కార్డుల సృష్టికర్త జాయ్స్ హాల్ పరిచయం చేసారు. ఆ తర్వాత 1958లో డాక్టర్ రామన్ అనే వ్యక్తి కారణంగా ఫ్రెండ్ షిప్ డే అనే పేరుతో పిలవడం మొదలైంది.
Details
ఫ్రెండ్ షిప్ డే ఎందుకు జరుపుకుంటారు?
మనుషుల మధ్య ఉన్న కుల, మత, ప్రాంత, దేశ అంతరాలు తొలగిపోయి అందరూ ఆనందంగా ఉండాలన్న ఆకాంక్షతో ఫ్రెండ్ షిప్ డే మొదలైంది.
స్నేహం ఒక్కటే మనుషుల మధ్య విభేధాలను దూరం చేయగలదని డాక్టర్ రామన్ నమ్మారు.
ఫ్రెండ్ షిప్ డే గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు
మొదటిసారిగా ఫ్రెండ్ షిప్ డేని జరుపుకున్న దేశం పరాగ్వే (జులై 30, 1958).
ప్రతీ సెప్టెంబర్ మూడవ ఆదివారం రోజున మహిళల కోసం ప్రత్యేకంగా ప్రపంచ మహిళా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుతారు.
స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక నెల కూడా ఉంది. ఫిబ్రవరి నెలను ఫ్రెండ్ షిప్ మంత్ గా జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని రకరకాలుగా జరుపుకుంటారు.