Friend ship Day 2024 : స్నేహితుల దినోత్సవం ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా!
స్నేహానికి ఆస్తులు, కులం, మతం, హోదాలు వంటి బేధాలు ఏవీ ఉండవు. కష్టం, సుఖం, బాధ, ఎంజాయ్ అన్నింటిలోనూ తోడు ఉంటాడు. ఇంట్లో వాళ్లతో చెప్పుకోలేని విషయాలెన్నో స్నేహితులతో పంచుకుంటాం. అందరి జీవితంతోనూ స్నేహితుడు ఉంటాడు. స్నేహితులుగా ఉండి కష్ట సుఖలతో పాటు మంచి చెడులను తెలుసుకుంటాం. ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవం ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేష్ చేసుకుంటాం.
మంచి విలువలు ఉన్న స్నేహితుడు అవసరం
రామాయణం, మహాభారతం కాలం నుంచి స్నేహితులుగా ఉండి ఎంతోమంది ప్రాణ త్యాగాలను చేసిన కథలను కూడా మనం చదివాం. పురణాల్లో కృష్ణుడు-కుచేలుడు, దుర్యోధనుడు-కర్ణుడు, రాముడు- సుగ్రీవుడు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి విలువలు ఉన్న స్నేహితుడు దొరికితే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కర్ణుడు నిజానికి చాలా గొప్పవాడు, శక్తివంతుడు. కానీ చెడు లక్షణాలు ఉన్న కౌరువుల వైపు ఉన్న కారణంగా చరిత్రలో చెడ్డపేరును తెచ్చుకున్నాడు.
1958లో తొలిసారి ఫ్రెండ్ షిప్ డే వేడుకలు
అసలు స్నేహితుల రోజు వెనుక ఉన్న రహాస్యాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈసారి స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు 4న జరుపుకోనున్నారు. హాల్‌మార్క్ కార్డ్‌ల వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ 1958లో తొలిసారి ఫ్రెండ్ షిప్ డే వేడుకలు నిర్వహించాడట. ఆ తర్వాత 1958 లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్ షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా, క్రమంగా ఐక్యరాజ్యసమితి కూడా దీన్ని పాటించడం మొదలు పెట్టాయి.
పాకిస్థాన్ లో జూలై 30న స్నేహితుల దినోత్సవం
ప్రజలు, దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహాన్ని ప్రోత్సహించడం ద్వారా శాంతి ప్రయత్నాలకు ప్రేరణనివ్వడం, సమాజాల మధ్య వారధులు నిర్మించగలదనే ఆలోచనతో UN జనరల్ అసెంబ్లీ 2011లో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించిందని UN తన అధికారిక వెబ్‌సైట్‌లో రాసింది. భారతదేశంతో పాటు మలేషియా, యూఏఈ, బంగ్లాదేశ్, యూఎస్ దేశాలు ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాకిస్తాన్‌లో మాత్రం జూలై 30వ తేదీన సెల్రబేట్ చేసుకుంటారు.