LOADING...
Friendship day 2025: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేకంగా  ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి ఐడియాలు ఇవే!
మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి ఐడియాలు ఇవే!

Friendship day 2025: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేకంగా  ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి ఐడియాలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనకు కుటుంబసభ్యులను ఎంచుకునే అవకాశం ఉండకపోయినా... స్నేహితులను మాత్రం మనమే ఎన్నుకోవచ్చు. మొదట అపరిచితులుగా మొదలైన ప్రయాణం... ఆ తర్వాత జీవితాంతం నిలిచిపోయే మైత్రీబంధంగా మారుతుంది. చాలామందికి స్నేహితులే జీవితసారమవుతారు. వారి సహాయంతోనే జీవితం కొనసాగించే వాళ్లూ చాలా మంది ఉన్నారు. అందుకే స్నేహానికి ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. స్నేహితులతో కలిసి ఇష్టమైన వంటకాలు తినడం, ఆడిపాడటం, గాసిప్స్‌ చేసుకోవడం, ఎన్నో జ్ఞాపకాలను సృష్టించడం... ఇవన్నీ ఉత్తమ మిత్రుల మధ్య జరిగే మధురానుభూతులు. ఈ బంధం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప అనుబంధంగా మారుతుంది.

వివరాలు 

ఉత్తమ స్నేహితులు లేని జీవితాన్ని మనం ఊహించలేము

ప్రేమ, అనురాగంతో నిండిన స్నేహితులు ప్రతి ఒక్కరికి అవసరం.ఇద్దరి మధ్య ఎన్నో చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. మనం ఏడిస్తే ఓదార్చే చేయి అందించేది స్నేహితులే. గెలిచినప్పుడు ఆనందంతో బిగ్గరగా అరిచి సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఉత్తమ స్నేహితులు లేని జీవితాన్ని మనం ఊహించలేము. స్నేహితులు అంటే మన జీవితాన్ని గమనాన్ని మార్చే వ్యక్తులు. మన నవ్వులను రెట్టింపు చేస్తారు. మన బాధను పంచుకుంటారు. మన కోసం ఫ్రెండ్షిప్ డేను ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మీ స్నేహితులతో కలిసి జరుపుకోవడానికి కొన్ని క్రియేటివ్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఫ్రెండ్షిప్ డే వచ్చేస్తోంది కాబట్టి, మీరు వారితో పగలు మొత్తం ఆనందంగా గడపవచ్చు.

వివరాలు 

క్రియేటివ్ ఐడియాలు

1. రోడ్ ట్రిప్: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి కారు బుక్ చేసుకుని, ఇష్టమైన ఫుడ్ ప్యాక్ చేసుకొని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లండి. నేషనల్ హైవేలు మీదుగా ప్రయాణిస్తూ స్వేచ్ఛగా గాలిని అనుభవించండి. మీకు నచ్చిన పాటలు వింటూ, సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించండి. 2. రిసార్ట్‌లో రిలాక్స్ అవ్వండి: ఉదయం నుండి రాత్రివరకు ఒక మంచి రిసార్ట్ బుక్ చేసుకుని, పది మందికిపైగా స్నేహితులతో కలిసి ఫ్రెండ్షిప్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయండి. గేమ్స్ ఆడండి, లైవ్ మ్యూజిక్ ఆస్వాదించండి, మీకు ఇష్టమైన భోజనం పంచుకుంటూ ఫోటోలు దిగండి. ఈరోజు మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది.

వివరాలు 

క్రియేటివ్ ఐడియాలు

3. జూమ్ కాల్ లో: మీ చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు ఒక్కచోట ఉండకపోవచ్చు. ఎవరో విదేశాల్లో ఉండొచ్చు. వారందరితో జూమ్ మీటింగ్ పెట్టండి. ఎప్పటి కబుర్లను చెప్పుకోండి. మీరు భౌతికంగా దూరంగా ఉన్నా... మీ మనసులు కలిసే వేదికగా జూమ్ మీటింగ్ చాలు. అసలైన స్నేహం దూరాలు ఏవీ పట్టించుకోదు. 4. పెయింటింగ్ క్లాసులు: మీరు, మీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి సృజనాత్మకంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. ఇద్దరూ కలిసి పెయింటింగ్ చేయండి, ఇష్టమైన వంటకాలు వండుకోండి లేదా షాపింగ్‌కి వెళ్లండి. స్నేహితులతో కలిసి చేసే చిన్న చిన్న పనులు పెద్ద ఆనందాన్ని ఇస్తాయి.

వివరాలు 

క్రియేటివ్ ఐడియాలు

5. పిక్నిక్ ప్లాన్: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి లంచ్ ప్యాక్ చేసుకుని ఒక బాగున్న పార్క్‌కి వెళ్లండి. అక్కడ కూర్చుని కాలేజీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, ఒక రోజంతా పార్కులో తిరుగుతూ ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేయండి. 6. కాఫీ డేట్ & గిఫ్ట్స్ : మీ బెస్ట్ మేట్‌ని కాఫీ డేట్‌కి తీసుకెళ్లండి. వారికి మీ ప్రేమను తెలిపే చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. ఒక చిన్న లేఖ రాసి అందించండి. లేదా హృదయంతో నిండిన గ్రీటింగ్ కార్డు ఇవ్వండి. ''నీవు నాకు ఎంత ముఖ్యమైనవాడివో'' అని చెబితే వారికి ఈరోజు జీవితాంతం గుర్తుండిపోతుంది.