Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే
ఒకరితో స్నేహం మొదలెట్టినపుడు ఆ ప్రయాణంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి. ఆ అనుభవాలు మీకు హాని చేయకపోతే అవతలి వారు మీతో నిజంగా స్నేహం చేస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం నిజమైన స్నేహితులను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం. మీ హద్దులను గౌరవిస్తాడు: ఏ బంధంలో అయినా హద్దులు ఉండటం మంచిది. నిజమైన స్నేహితుడు మీరు పెట్టుకున్న పరిధులను దాటి రాడు. మీ హద్దులను గౌరవిస్తాడు. స్నేహంలో తేడాగా ఉన్నవారే హద్దులను అతిక్రమించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మీరు మీలా ఉంటారు: ఏ స్నేహితుల సమక్షంలో మీరు మీలా ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. వాళ్ళ మెప్పు కోసం నటించకుండా మీరుంటే వాళ్ళతో మీ స్నేహం దృఢంగా ఉన్నట్లే లెక్క.
మీరు బాగుండాలని కోరుకునే స్నేహితులు
మీ మాటలు వినేవాళ్ళు: మాట వినడం అంటే నెగ్గడం కాదు, మీ బాధను అర్థం చేసుకునేవారని అర్థం. వింటున్నట్టు నటించకుండా నిజంగా మీ మాటలను ఫీలయ్యేవాళ్ళు మీ నిజమైన స్నేహితులు. మీరు జాబ్ పోయిందని మీ స్నేహితుడితో చెబితే, జాబ్ ఓపెనింగ్స్ గురించి మీకు సమాచారం ఇచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. నిజమైన స్నేహితులు మీరు బాగుండాలని అనుకుంటారు. మీలో ప్రేరణ కలిగిస్తారు: మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు నిజమైన స్నేహితులు అని చెప్పవచ్చు. బాధను దూరం చేయడానికో, బ్రతుకులో గెలవడానికో లేదా భయాన్ని పోగొట్టడానికో మీలో ప్రేరణ కలిగించే వాళ్ళు మీకు స్నేహితులుగా దొరికితే వాళ్ళను వదులుకోకండి.