Friendship: వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహంలో వచ్చే మార్పులు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
కాలం మారుతున్న కొద్దీ బంధాలు కూడా మారుతుంటాయి. అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని చెబుతుంటారు. మరి కాలం మారుతున్న కొద్దీ స్నేహం ఏ విధంగా మారుతుంది? ఏ విధంగా మారాలి?
వయసు పెరుగుతుంటే స్నేహంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.
క్వాలిటీ స్నేహాలు:
యవ్వనంలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. కానీ బాధ్యతలు వచ్చాక ఎవరు నిజమైన స్నేహితులో అర్థమవుతుంది.
అందుకే ఎక్కువమందితో బంధం ఉంచుకోకుండా చాలా కొద్దిమందితోనే స్నేహం కొనసాగిస్తారు. అది మంచిది కూడా.
వదిలిపోయే స్నేహాలు: చదువుకునే సమయంలో రోజూ కనిపించడం వల్ల స్నేహం గట్టిగా ఉంటుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఊర్లు మారాల్సి వస్తుంది. ఇలాంటి టైమ్ లో కొన్ని స్నేహాలు దూరమైపోతుంటాయి.
Details
వయసు పెరిగినపుడు స్నేహంలో కనిపించని వయస్సు
కేవలం నిజమైన స్నేహం మాత్రమే మీరెంత దూరం వెళ్ళినా మీతో పాటు ఉంటుంది. అలాంటి స్నేహాలను ఎప్పటికీ వదులుకోకూడదు.
స్నేహంపై స్పష్టమైన అవగాహన:
అవతలి వారి ఆసక్తులు, హాబీలు ఒకేలా ఉంటే స్నేహం చేయడమనేది వయసు పెరుగుతుంటే తగ్గిపోతుంది. వయసు మీద పడుతున్న సమయంలో విలువలు ముఖ్యం అవుతాయి.
జీవితంలో మీకేం కావాలనేది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం అవతలి వారితో మీ స్నేహం మారుతుంది.
వయసు పెరిగినపుడు పెద్దవారితోనూ స్నేహం:
స్కూల్, కాలేజీ వయసులో తమ వయసులో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు. కానీ ఒక వయసులోకి వచ్చాక అలా ఉండదు. పరిణతి వచ్చిన వాళ్ళు తమకంటే చాలా చిన్నవారితోనూ స్నేహం చేస్తారు. అలాగే తమకంటే చాలా పెద్దవారితోనూ స్నేహం చేస్తారు.