Page Loader
Telangana Culture: చెరకు నుంచి చీర వరకు.. పల్లె జీవనానికి అద్దం పట్టే తెలంగాణ గొప్పదనం అంతా ఇంతా కాదు! 
చెరకు నుంచి చీర వరకు.. పల్లె జీవనానికి అద్దం పట్టే తెలంగాణ గొప్పదనం అంతా ఇంతా కాదు!

Telangana Culture: చెరకు నుంచి చీర వరకు.. పల్లె జీవనానికి అద్దం పట్టే తెలంగాణ గొప్పదనం అంతా ఇంతా కాదు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కోటి రతనాల వీణ నా తెలంగాణ' అని మహాకవి దాశరథి కృష్ణమాచార్య గర్వంగా వర్ణించిన ఈ భూమి, నిజంగానే కళలకూ, జీవనశైలికీ అద్దంపడుతోంది. పురాతన కాలం నుంచే జానపద కళలు, హస్తకళలు, పండుగల వైవిధ్యం తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టాయి. గ్రామీణ జీవన శైలి, ప్రకృతిని నిమిత్తం చేసుకున్న పండుగలు, చేతివృత్తుల పటిమ.. ఇవన్నీ కలసి మన రాష్ట్రాన్ని సాంస్కృతికంగా ఓ సంపదగా నిలబెడుతున్నాయి.

Details

 కరీంనగర్‌ ఫిలిగ్రీ కళ - వెండి తీగల లోకమే వేరే

వెండి తీగలతో అద్భుత వస్తువులు తయారుచేసే 'ఫిలిగ్రీ' హస్తకళకు కరీంనగర్‌ ఘనతచెందింది. ఈ కళ ఒడిశా, ఇండోనేషియా నుంచి ప్రవేశించి, నిజాం కాలంలో నవాబుల ఆభిరుచికి అనుగుణంగా అభివృద్ధి చెందింది. కాకతీయుల నుంచి అసఫ్‌జాహీల వరకు ఈ కళకు రాజాశ్రయం లభించింది. నాజూకైన వెండి తీగలతో రూపొందించే వస్తువులు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా కరీంనగర్‌ కళాకారులు నూతన రూపాలకూ ప్రాధాన్యత ఇస్తూ ఈ కళను సజీవంగా ఉంచుతున్నారు.

Details

 చేనేతలో చరిత్ర - పోచంపల్లి నుండి నిర్మల్‌ వరకూ 

తెలంగాణ చేనేత శిల్పకళలు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చుకున్నాయి. పోచంపల్లి పట్టుచీరలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం లేసు అల్లికలు, మెదక్‌ జిల్లా అద్దకం వస్త్రాలు, సిద్ధిపేట, కురనపల్లి, పాదగల్‌ ప్రాంతాల ఇత్తడి కళలు ప్రతిభను చాటుతున్నాయి. నిర్మల్‌ బొమ్మల తయారీలో వాడే బూరుగు, పొనుగుకర్ర వంటి స్థానిక వనరులు కలల్ని బొమ్మలుగా మలుస్తున్నాయి. ఏటికొప్పాకలో లక్కపిడతలు, చదరంగపు బల్లలు, పన్నీరు బుడ్లు తయారీ పిల్లల హర్షాతిరేకానికి కారణమవుతున్నాయి.

Details

జానపద కళల సందడి - ఊరూరు నిండిన రంగులు 

తెలంగాణ జానపద కళల ఊపెత్తే ఊపిరితో నిండిన రాష్ట్రం. తోలు బొమ్మలాటలు, భాగవతాలు, యక్షగానం, పులినృత్యం, ఒగ్గుకథలు గ్రామీణ ప్రజల ఊహా ప్రపంచానికి రూపాలివ్వడం కాదు, సమాజంలో సందేశాన్ని చొప్పించడానికీ వేదికలవుతాయి. భజన, కోలాటం, గంగిరెద్దులాట వంటి కళలూ పండుగల సమయాల్లో గ్రామీణ జీవనానికి ఉట్టిపడేలా ఉంటుంది.

Details

బతుకమ్మ, బోనాలు - ప్రకృతిని ఆరాధించే పండుగలు 

తెలంగాణ పండుగలలో ప్రత్యేకతే వేరే. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే తీరులో నిరూపించబడిన సంస్కృతిక భావన. తొమ్మిది రోజుల పాటు పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆడవాళ్లు పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. బోనాలు మళ్లీ ఓ వైపుగా ఆడపడుచుల శక్తిస్వరూపాల పట్ల గౌరవానికి ప్రతీక. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో వీటి వైభవం ఊహించలేనంతగా ఉంటుంది.

Details

మేడారం జాతర - విరాట స్థాయిలో గిరిజన ఆరాధన 

మేడారం జాతరకు ఉన్న ప్రాచీన నేపథ్యం, సమ్మక్క-సారలమ్మల పట్ల గిరిజనుల విశ్వాసం ఈ ఉత్సవాన్ని దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా నిలబెట్టాయి. కుంభమేళా తర్వాత అత్యధిక భక్తులు తరలివచ్చే ఈ జాతరలో బెల్లాన్ని బంగారంగా సమర్పించడం ఓ అద్భుతమైన సంప్రదాయం. అలాగే పెద్దగట్టు జాతర, నాగ్సాన్‌పల్లిలో జరిగే ఏడుపాయల జాతర, కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి జాతరలు రాష్ట్రపు సాంస్కృతిక సంపదలో మిన్నగా నిలుస్తున్నాయి.