
Gardening: మీ జేబుకు ఆదాయాన్ని మీకు ఆనందాన్ని ఇచ్చే పెరట్లోని మొక్కలు
ఈ వార్తాకథనం ఏంటి
మీకు మొక్కలు పెంచే అలవాటుందా? మీ పెరట్లో రకరకాల మొక్కలను పెంచడం మీకిష్టమా? అయితే ఆ ఇష్టంతో డబ్బులు కూడా సంపాదించవచ్చని తెలుసుకోండి.
అవును, మీ జేబుకు ఆదాయాన్ని అందించే మొక్కల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఏయే మొక్కలను పెంచితే డబ్బులు సంపాదించవచ్చో తెలుసుకుందాం.
చెర్రీ టమాట:
ఇవి చూడడానికి చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. రుచికి తియ్యగా ఉండే ఈ పండ్ల మొక్కలను సంవత్సరం మొత్తం పెంచవచ్చు.
సంవత్సరాంతం పండ్లు కాస్తూనే ఉంటాయి. వేసవిలో మరింత ఎక్కువగా కాస్తాయి. ఈ మొక్కలకు రోజులో 4గంటల పాటు సూర్యరశ్మి చాలా అవసరం.
Details
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతం ఎక్కువగా లేకపోవడం వంటి ప్రదేశాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి.
ఈ మొక్కను పెరట్లో కూడా పెంచవచ్చు. కాకపోతే ఈ మొక్కకు పండ్లు కాయడానికి సమయం పడుతుంది.
లీచీ:
ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ మొక్క పెరుగుతుంది. చలికాలం పూర్తయిపోయి వేసవి సమీపిస్తున్న సమయంలో ఈ మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. లీచి పండ్లకు మార్కెట్లో గిరాకీ చాలా ఎక్కువ.
పసుపు:
పసుపును కూడా పెరట్లో పెంచవచ్చు. దీన్ని పెంచాలంటే కొంచెం తేమ, కొంచె వేడి వాతావరణం ఉండాలి. సూర్యుడి ఎండ పడే విధంగా మొక్కను పెంచినట్లయితే పసుపు సులభంగా పెరుగుతుంది.