
పొద్దున్న లేవగానే కడుపు క్లీన్ కావడం లేదా? మలబద్దకం సమస్యను దూరం చేసే పద్దతులు
ఈ వార్తాకథనం ఏంటి
పొద్దున్న లేవగానే కడుపు సరిగ్గా క్లీన్ కాకపోతే ఆ రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని అర్థం.
మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా అనిపిస్తుంది. కానీ దీనివల్ల శరీరానికి అనేక నష్టాలు జరుగుతాయి.
ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపునొప్పి, గ్యాస్, త్రేన్పులు రావడం, గుండె మంట మొదలగు సమస్యలు మలబద్ధకం వల్ల వస్తాయి.
ప్రస్తుతం మలబద్ధకాన్ని దూరం చేసే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.
ఫైబర్ ఆహారాలను తీసుకోవాలి:
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఫైబర్ వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. దీనివల్ల మలబద్ధకం దూరమవుతుంది.
Details
గోరువెచ్చని నీళ్లు
పొద్దున్న లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగండి. దీనివల్ల కడుపులో పేగుల్లో కదలికలు ఏర్పడి కడుపు ఖాళీ అవుతుంది. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
బెల్లం, నెయ్యి:
బెల్లాన్ని పొడిగా చేసి అందులో కొంచెం నెయ్యిని కలిపి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ:
పై మూడింటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు.
నువ్వులు:
రాత్రి భోజనం చేసిన తర్వాత నువ్వుల పొడిని తినండి. దీనిలోని పోషకాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహకరిస్తాయి. తద్వారా మలబద్ధకం దూరం అవుతుంది.