
డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణ పరిస్థితులు, ఆహార ప్రియులు అభిరుచికి తగ్గట్లు వ్యాపారులు వెరైటీ తినుబండారాలను మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు.
తాజాగా వేసవి కాలంను దృష్టిని ఉంచుకొని సూరత్‌లోని పలు రెస్టారెంట్ల నిర్వాహకులు గోల్డెన్ ఐస్ క్రీమ్‌ను వివిధ ఫ్లేవర్లలో వినియోగదారలకు అందిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలతో ఐస్ క్రీమ్‌ను తినేందుకు రెస్టారెంట్లకు వెళ్లే వినియోగదారులను ఈ 24క్యారెట్ల బంగారపు పూత పోసోసిన హిమ క్రిములు తెగ ఆకర్షిస్తున్నాయి.
గోల్డెన్ ఐస్ క్రీమ్‌లు రుచికరంగా ఉండటంతో పాటు అందానికి కూడా దోహదపడుతుంటంతో చాలామంది వాటిని తినేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
సూరత్
ఒక్కో ఐస్ క్రీమ్ జీఎస్టీతో కలిపి 1000 రూపాయలు
గోల్డెన్ ఐస్ క్రీమ్‌ల అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడగానే నోట్లో వేసుకొని తినాలనిపించేలా వీటిని స్పెషల్ మేకోవర్ చేస్తారు.
సూరత్‌లో విక్రయించే గోల్డెన్ ఐస్ క్రీమ్‌ల కోసం వందల కిలోమిటర్ల నుంచి రావడం గమనార్హం. అయితే బంగారపు పూత పోసిన ఈ ఐస్ క్రీమ్ ధర జీఎస్టీతో కలిపి 1000 రూపాయలకు విక్రయస్తున్నారు.
ధర వెయ్యి రూపాయిలు ఉన్నా, వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
గోల్డెన్ ఐస్ క్రీమ్‌లలో డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, లడ్డూలు ఇలా రకరకాల రుచులతో కూడిన ఫ్లేవర్స్ ఉండటంతో, అన్ని వెరైటీలను టేస్ట్ చేయడానికి వచ్చిన వారే మళ్లీ వస్తున్నారని రెస్టారెంట్ నిర్వహాకులు చెబుతున్నారు.