Page Loader
Special Train: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఈనెల 13న ప్రత్యేక రైలు
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఈనెల 13న ప్రత్యేక రైలు

Special Train: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. ఈనెల 13న ప్రత్యేక రైలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ అధికారులు తిరుమల వెళ్లే భక్తుల కోసం గుడ్ న్యూస్ అందించారు. ఈ నెల 13న తిరుపతి, సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైలు 13వ తేదీ రాత్రి 8:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లె, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాల మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాయలసీమ జిల్లాలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Details

ఈనెల 13 నుండి 24 వరకు స్పెషల్ ట్రైన్స్

ఈ నెల 12 నుండి 24 వరకు ఈ రైళ్లు రాయలసీమ ప్రాంతాల మీదుగా ఇవి నడుస్తాయి. ఈ రైళ్లు ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఆగిపోతాయి. నవంబర్ 12, 19 తేదీలలో బెంగలూరు (ఎస్ఎమ్వీటీ) నుండి బరౌని ప్రత్యేక రైలు బయలుదేరి, రాత్రి 9:15 గంటలకు బరౌని చేరుకుంటుంది. ఈ రైలు ధర్మవరం, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో బరౌని నుండి నవంబర్ 15, 22 తేదీల్లో బయలుదేరి, మరుసటి రోజు ఎస్ఎమ్వీటీ బెంగలూరు చేరుకుంటుంది. ముజాఫర్‌పూర్ (12, 19, 26), ధానాపూర్ (14, 21) మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 13 నుండి 24 వరకు అందుబాటులో ఉంటాయి.