గ్రామీ అవార్డ్స్ 2023: రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ లుక్ తో అందరినీ ఆకర్షించిన సింగర్స్
65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై చాలామంది సంగీత కళాకారులు విభిన్నమైన ఫ్యాషన్ దుస్తులతో తళుక్కుమన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం. హ్యారీ స్టైల్స్ రెయిన్ బో జంప్ సూట్ : ఫేమస్ సింగర్, పాటల రచయిత హ్యారీ స్టైల్స్, గ్రామీ అవార్డుల కార్యక్రమంలో విభిన్నంగా రంగురంగుల జంప్ సూట్ లో దర్శనమిచ్చారు. లో నెక్ డ్రెస్ లో టాటూస్ కనిపించే విధంగా మెరిసాడు. డోజా క్యాట్ బ్లాక్ లెదర్ డ్రెస్: ర్యాపర్ డోజా క్యాట్ బ్లాక్ లెదర్ డ్రెస్ లో మెరిసిపోయింది. బూడిద రంగు లిప్ స్టిక్స్, చెవులకు వేలాడే రింగులు, వింగ్డ్ ఐలైనర్ తో దర్శనమిచ్చింది.
గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద కనిపించిన విభిన్నమైన ఫ్యాషన్ మూమెంట్స్
పూలతోటలా మెరిసిపోయిన లిజ్జో: ఆరెంజ్ కలర్ గౌన్ లో రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చిన లిజ్జో, పూలతోటలా అందంగా కనిపించింది. కార్డీ బీ వేసుకున్న బ్లూ గౌన్: అమెరికాకు చెందిన ర్యాపర్, పాటల రచయిత కార్డీ బీ, బ్లూ కలర్ గౌన్ లో అందరినీ ఆకర్షించింది. ఈ గౌన్ ని గౌరవ్ గుప్తా డిజైన్ చేసారు. తలమీద టోపీ మాదిరిగా ఉండి, నడుము దగ్గర కొంచెం చర్మం ఎలివేట్ అయ్యేలా డిజైన్ చేసారు. షానియా ట్వెయిన్ చుక్కల డ్రెస్: ఐదు సార్లు గ్రామీ అవార్డ్ అందుకున్న కెనడాకు చెందిన సింగర్ షానియా ట్వెయిన్, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో చుక్కలు చుక్కలుగా ఉండే సూట్ వేసుకుంది.