NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Green Road :అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Green Road :అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?
    అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?

    Green Road :అమర్‌పూర్ పంచాయతీ నిర్మించిన ఆకుపచ్చ రహదారి.. ఎందుకు వేశారో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2024
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నీలిరంగు రహదారికి ప్రేరణగా, ఇప్పుడు తూర్పు బర్ద్వాన్ జిల్లాలో మరో అద్భుతం గ్రీన్ రోడ్ రూపంలో ప్రత్యక్షమైంది.

    ఈ రహదారి పచ్చని తివాచీని ప్రదర్శిస్తూ, ఆహ్లాదకరమైన అందంతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది.

    ఈ ప్రత్యేక ఆకుపచ్చ రహదారి పూర్బా బర్ధమాన్ జిల్లాలోని ఆయుష్‌గ్రామ్ ప్రాంతంలో అమర్‌పూర్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మితమైంది.

    సాధారణ నల్లటి రోడ్లకు భిన్నంగా, పచ్చని రంగుతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఈ రహదారి పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను ముందుకు నడిపే కృషిగా నిలిచింది.

    వివరాలు 

    గ్రీన్ రహదారి నిర్మాణానికి వినూత్న పద్ధతులు 

    అమర్‌పూర్ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ రహదారిని రూపొందించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించారు.

    పచ్చటి సీల్ కోట్‌ను తారుతో మిళితం చేసి, ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఉపయోగించడం వంటి ఆచరణాత్మక పరిష్కారాలు అమలులోకి తెచ్చారు.

    ఈ ప్రాజెక్టుకు ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు అందించగా, దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో కాళికాపూర్ ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి ముచ్చిపర ఎస్టీ పారా వరకు ఈ రహదారి నిర్మాణం పూర్తయింది.

    వివరాలు 

    పర్యాటకులకు ఆకర్షణగా మారిన రహదారి 

    కాళికాపూర్ ప్రాంతం, చారిత్రక ప్రాధాన్యంతో పాటు, ఈ ఆకుపచ్చ రహదారి కారణంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

    అనేక సినిమాల చిత్రీకరణకు గర్వకారణమైన ఈ ప్రదేశం, ఇప్పుడు ఈ కొత్త రహదారితో మరింత ఆహ్లాదకరంగా మారింది.

    ఈ ఆకుపచ్చ రహదారి స్థానిక దృశ్యాలను మెరుగుపరుస్తూ, పర్యాటకులను ఆకర్షిస్తోంది.

    ప్రజల స్పందన

    ఆయుష్‌గ్రామ్‌కు చెందిన యువకుడు సంజు ఈ రహదారిపై తన గర్వాన్ని వ్యక్తం చేస్తూ, "మన ఊరిలో ఇలాంటి ప్రత్యేక రహదారి ఉండటం ఆనందకరం. ఇది జంగల్‌మహల్ ప్రాంతానికి మరింత ప్రాచుర్యాన్ని తెస్తోంది," అని వ్యాఖ్యానించాడు.

    వివరాలు 

    ఈ రహదారి విశిష్టతలు 

    వర్షాల నుండి రహదారిని రక్షించే ప్రత్యేక పూత.

    రహదారి మన్నికను గణనీయంగా పెంచడం.

    పర్యావరణ పునరుత్థానానికి ఉదాహరణగా నిలవడం.

    అధికారుల ప్రకారం, ఇలాంటి పర్యావరణహిత రహదారులను ఇతర ప్రాంతాల్లో కూడా నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

    ఈ గ్రీన్ రహదారి స్థానిక అభివృద్ధికి తోడ్పడడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శిగా నిలుస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పర్యాటకం

    ఇంటర్నేషనల్ చాక్లెట్ డే: చాక్లెట్ ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలు  ముఖ్యమైన తేదీలు
    జపాన్ వెళ్తే బట్టలు అవసరం లేకుండా రెంటల్ క్లాత్స్ ని పరిచయం చేస్తున్న జపాన్ ఎయిర్ లైన్స్  జపాన్
    కేరళలో తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈ ప్రదేశాల గురించి తెలుసుకోండి కేరళ
    కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025