Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే..
చలికాలం ప్రారంభం అయినప్పటి నుండి ఉమ్మడి విశాఖపట్టణం,అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. పాడేరు ఏజెన్సీలో ఉన్న వంజంగి కొండ,మేఘాల కొండ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రదేశాలు. ప్రతి శీతాకాలంలో వంజంగి కొండ ఒక చరిత్రను సృష్టించేలా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఉదయం సమయంలో అక్కడ పడే పొగమంచు,కొండ శిఖరాలు పాల సముద్రాన్ని అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రకృతి అందాల వైభవాన్ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహంగా వస్తారు.పర్యాటకులు అక్కడి అద్భుతమైన దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసి ఆనందపడతారు. వంజంగి కొండ పైకి వెళ్లేందుకు దేశంలోని వివిధప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు. ఇక్కడ గనుక చలిని ఆస్వాదించేందుకు శీతాకాలంలో రాత్రి పర్యాటకులు వచ్చి కొండపై గుడారాలు పెట్టి,మంటలు వేసి సుఖంగా గడుపుతారు.
ద్విచక్ర వాహనాలు ద్వారా కొండపైకి..
ఈ వంజంగి కొండను చూడాలనుకుంటే, తెల్లవారుజామున 3 గంటలకు పాడేరు నుండి ప్రారంభం కావాలి. కొండ దిగువ స్థలంలో పార్కింగ్ చేయవచ్చు. ద్విచక్ర వాహనాలు ద్వారా కొండపైకి కొంత దూరం వెళ్లవచ్చు. తదుపరి, కొండపైకి నడిచి వెళ్లి, ఉదయాన్నే ఎర్రటి సూర్యుడు మన ముందు కనిపించడమే కాక, మంచు దృశ్యాలు కూడా మమేకమవుతాయి. ఇక్కడే శీతల గాలి, మంచు హవా రాత్రి పొడవునా కూడా కనిపిస్తుంది. వంజంగి కొండలు పాడేరు పట్టణానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి సమయం అయితే, నైట్ ఫైర్ క్యాంప్ అనుభవం కూడా ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవచ్చు.