LOADING...
Hanuman Jayanti Special: హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలతో పర్ఫెక్ట్ నైవేద్యం
హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలతో పర్ఫెక్ట్ నైవేద్యం

Hanuman Jayanti Special: హనుమాన్ జయంతి స్పెషల్.. బియ్యంపిండి అప్పాలతో పర్ఫెక్ట్ నైవేద్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ప్రత్యేకంగా నైవేద్యంగా పెట్టేందుకు ఈ బియ్యంపిండి అప్పాలు అద్భుతమైన ఎంపిక. పండుగల సమయంలో చేసుకునే పర్ఫెక్ట్ స్వీట్‌గా ఇవి అందరికీ నచ్చుతాయి. మరి ఆలస్యం ఎందుకు... ఈ టేస్టీ అప్పాల తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర కిలో నూనె.

వివరాలు

తయారీ విధానం

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి వేసుకోవాలి. అందులో కారం, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, కరివేపాకు ఆకులు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా నూనె పోసి పిండిలో బాగా కలిసేలా చేయాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. పిండి సిద్ధమైన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ లేదా ఆకుపై కొద్దిగా నూనె రాసి, ఆ ఉండలను తీసుకుని అప్పాల్లా ఒత్తుకోవాలి.

వివరాలు

తయారీ విధానం1/2

స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక, తయారుచేసిన అప్పాలను అందులో వేసి సన్నని మంటపై నెమ్మదిగా వేయించాలి. బంగారు రంగు వచ్చే వరకు బాగా కాల్చాలి. అంతే... వేడి వేడి బియ్యంపిండి అప్పాలు సిద్ధం. చల్లారిన తర్వాత ప్లేట్ లేదా గిన్నెలో తీసుకోవచ్చు. డబ్బాలో నిల్వ చేస్తే ఇవి కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు.

Advertisement