
Headache in summer: వేసవిలో తలనొప్పి.. ఇలా చేస్తే చిటికెలో తగ్గిపోతుంది!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో తలనొప్పి వస్తే, ఇంట్లోనే సహజ చిట్కాలను అనుసరించవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ఉపయోగపడుతుంది.
ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల శరీర అలసట, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల తలనొప్పి పెరుగుతుంది.
అందువల్ల, నీడలో ఉండటం మంచిది. తలనొప్పిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలని ప్రయత్నించండి.
ఎండలో బయటకు వెళ్ళవలసినప్పుడు, గొడుగు, స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం చాలా ఉపయోగకరం.
Details
ఈ వేసవిలో, తలనొప్పికి సహజ చిట్కాలు
1.తులసి, అల్లం టీ
తులసి, అల్లం కలిపి చల్లగా చేసిన టీ తాగండి. ఇది తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
2.మజ్జిగ
చల్లని మజ్జిగ తాగడం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, దాహం కూడా తీర్చుతుంది. మజ్జిగ తాగడం వల్ల తలనొప్పి, అలసట తగ్గుతాయి.
3.తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు
మజ్జిగ, చల్లని పండ్లు, సలాడ్లు వంటి ఆహారాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
4.విశ్రాంతి
శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం, తలనొప్పి తగ్గించడానికి చాలా ముఖ్యం. విశ్రాంతి సమయంలో శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
5.యోగా
యోగా వల్ల భవిష్యత్తులో తలనొప్పి రాకుండా చేస్తాయి. వీటితో శరీరం ప్రశాంతంగా ఉంటుంది, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.