అఖేతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్లిగియా సపిడాను మాములుగా అఖే అని పిలుస్తారు. ఈ జమైకన్ జాతీయ పండు నలుపు గింజలతో పసుపు రంగులో ఉంటుంది.
ఇందులో ఉన్న ఎర్రటి పొరను తీసేసి ఈ పండును తినాలి. అఖేను పండుగా మాత్రమే తీసుకోవాలి పండని అఖే తినడం చాలా ప్రమాదం.
ఇందులో విటమిన్ ఎ, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి.
అఖే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో అధికంగా పీచు ఉండటం వలన మలబద్దకం, ఊబకాయం వంటి సమస్యలను నివారిస్తుంది.
అఖేలో మూర్ఛ, ఇతర నరాల సమస్యలుకు అవసరమైన కీలకమైన విటమిన్ నియాసిన్ అధిక మొత్తంలో ఉంటుంది.
అఖే పండుతో ఆరోగ్యకరమైన చర్మంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడుతుంది.
అఖే
కాల్షియమ్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్న పండు
మెరుగైన దంత ఆరోగ్యానికి కూడా ఈ పండు బాగా పనిచేస్తుంది.
తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం , విరేచనాలు, స్కిన్ ఇన్ఫెక్షన్లకు ఈ పండు చికిత్సలాగా పనిచేస్తుంది.
'నవ్వినప్పుడే' అఖేని ఉపయోగించాలనే జమైకన్ సంప్రదాయ సామెత ఉంది. దీనర్థం, బాగా తెరుచుకున్న పండిన అఖేని మాత్రమే తినాలని.
పండని అఖేలో హైపోగ్లైసిన్ A, హైపోగ్లైసిన్ B వంటి విషపదార్ధాలు ఉంటాయి.
విత్తనాలు అయితే ఎప్పుడూ విషపూరితమైనవే కాబట్టి వంట చేయడానికి ముందు విత్తనాలను, ఎర్రటి పొరను తప్పనిసరిగా తొలగించాలి.
అఖేని ఉపయోగించే ముందు, విషాన్ని తొలగించడానికి బాగా ఉడకబెట్టి నీటిని జాగ్రత్తగా పారవేయాలి.
అఖేతో పాటు మిగిలిన కూరగాయలు ఉడకబెట్టకూడదు. సాల్ట్‌ఫిష్, కార్న్డ్ పోర్క్, కల్లాలూ, టొమాటో మొదలైన వాటితో అఖేని తినచ్చు.