Page Loader
Salt and Water: వేడినీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 
ఉప్పు నీరుతో రీహైడ్రేషన్,ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్

Salt and Water: వేడినీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2024
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పు మన ఆహారంలో కీలకమైన భాగం. ఉప్పు లేకుండా ఆహారం తినడం ఎంతో కష్టం. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఉప్పును మితంగా ఉపయోగించడం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. వైద్యులు రోజుకు సరైన మోతాదులో ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా,ఆహారంలో అనేక విధాలుగా ఉప్పును కలుపుకుని తింటాము.అనేక మార్గాలను అనుసరిస్తాము. కానీ,మితంగా ఉప్పు తీసుకునే కంటే, ప్రతిరోజు ఉదయం నీటిలో ఉప్పు కలుపుకుని త్రాగడం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగడం ద్వారా శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుంది. ఉప్పు నీటిలో పొటాషియం,కాల్షియం,మెగ్నీషియం వంటి మూలకాలు ఉంటాయి.ఈ నీటిని ప్రతిరోజూ తాగడం ద్వారా శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవచ్చు.

వివరాలు 

శరీరానికి అవసరమైన కాల్షియం

ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ కారణంగా,మనం అవసరమైనంత నీరు తాగలేకపోతున్నాం..అందువల్ల, రోజంతా శరీరం తేమవంతంగా ఉండేందుకు ఉదయం ఉప్పు కలిపిన నీరు తాగడం ఉత్తమంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన కాల్షియం మంచి మొత్తంలో అందాలంటే ఉప్పు కలిపిన నీటిని తాగడం మంచిది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల ఎముకలు,కండరాలు బలపడతాయి. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు ఉదయాన్నేఉప్పునీరు తాగడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం శరీరాన్ని శుభ్రపరిచే దివ్యమైన ప్రక్రియ. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు తీసి, అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వివరాలు 

మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గిస్తుంది

కిడ్నీ,కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అదనంగా, శరీరంలో టాక్సిన్స్ తొలగించడం ద్వారా చర్మం కూడా మెరుస్తుంది. మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గించడానికి ఉదయాన్నే ఉప్పు నీటిని క్రమం తప్పకుండా తాగడం అనుకూలంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడానికి కూడా ఉదయాన్నే ఉప్పు నీరు తాగడం ప్రయోజనకరమైంది.ఇది మలబద్ధకం సమస్యను తొలగించి,శరీర పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.కడుపులో మలబద్ధకం,ఎసిడిటీ సమస్యలు లేదా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఉన్నవారు,రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగాలి. ఇది జీర్ణశక్తిని మెరుగు పరచి,మెటబాలిజం పెరిగే దిశగా సహాయపడుతుంది..తద్వారా ఊబకాయం తగ్గుతుందని తెలుస్తుంది.