ఆరోగ్యం: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం నుండి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే అత్తి చెట్టు ఉపయోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
అత్తి చెట్టు.. దీన్నే ఔదుంబర వృక్షం అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం అత్తి చెట్టు వేర్లు, పువ్వులు, పండ్లు చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. ప్రస్తుతం అత్తి చెట్టు ఉపయోగాలు తెలుసుకుందాం.
చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
అత్తి చెట్టు బెరడు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ తో బాధపడే వారికి బాగా పనిచేస్తుంది. అత్తి చెట్టు పండ్లలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి.
గాయాలను మానేలా చేస్తుంది
ఈ చెట్టు నుండి కారే జిగురు లాంటి పదార్థం గాయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒరుసకుపోయిన గాయాలు, చిన్న చిన్న పురుగులు కాటు వేయడం వల్ల కలిగిన గాయాలు తగ్గిపోతాయి.
Details
మలబద్ధకాన్ని దూరం చేసే అత్తిచెట్టు
జ్వరం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది:
జ్వరంతో బాధపడే వారికి అత్తిచెట్టు మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి జ్వరం నుండి తొందరగా రికవరీ చేస్తుంది.
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది:
పేగులను పూర్తిగా శుభ్రం చేసి శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. మలబద్ధకం, పైల్స్, జీర్ణ సమస్యలు మొదలగు ఇబ్బందులను దూరం చేయడంలో అతి చెట్టు బాగా తోడ్పడుతుంది. అంతేకాదు బీపీని నియంత్రణలో ఉంచడంలో సహాయపడి గుండెకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
రుతుక్రమం సమయంలో అధిక రక్తస్రావాన్ని అదుపు చేస్తుంది:
రుతుక్రమం సమయంలో కొందరిలో రక్తస్రావం అధికంగా జరుగుతుంది. ఎండిపోయిన అత్తి పండ్లను చక్కెర తేనె కలుపుకొని తినడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.