
పులిపిర్లు తొలగించడానికి, తేలు విషాన్ని తగ్గించడానికి, దంతాలకు బలం చేకూర్చడానికి పనికొచ్చే పులిచింత మొక్క ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో విరివిగా పెరిగే పులిచింత మొక్క గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న ఆకులను కలిగి ఉండే ఈ మొక్కవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
పులిచింత మొక్కలు పొలాల గట్ల మీద ఎక్కువగా పెరుగుతాయి. ఒకచోట చిన్న మొక్క పెరిగిందంటే చాలు ఆ చుట్టు పక్కల మొత్తం పులిచింత మొక్కలు విరగకాస్తాయి.
ఈ మొక్కలు ఆకులు పుల్లగా ఉంటాయి. అందుకే పులిచింత అన్న పేరు వచ్చింది. మీకు పైల్స్ సమస్య ఉన్నట్లయితే పులిచింత రసాన్ని పైల్స్ భాగంలో రాసుకుంటే ఉపశమనం ఉంటుంది.
మీ దంతాలు ఊగుతున్నట్లయితే, పులిచింత వేర్లను నీళ్ళలో వేడి చేసి, వచ్చిన కషాయాన్ని నోట్లో పోసుకుని 10నిమిషాలు పుక్కిలించాలి. దీనివల్ల దంతాలకు బలం చేకూరి గట్టిపడతాయి.
Details
పులిపిర్లను తొలగించే పులిచింత
పులిచింత ఆకుల రసంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పులిపిర్లు ఉన్న చోట మర్దన చేస్తే ఆ పులిపిర్లు రాలిపోతాయి.
సైంధవ లవణం కలిపిన పులిచింత ఆకుల రసాన్ని తేలుకుట్టిన చోట మర్దన చేస్తే విషం తగ్గిపోతుంది.
పులిచింత ఆకులరసంలో కొద్దిగా పటికబెల్లం కలుపుకుని సేవిస్తే శరీరంలోని వేడి తగ్గిపోతుంది.
దంతాలను గట్టిపడేలా చేసే పులిచింతరసం, నోటి దుర్వాసనను పూర్తిగా తగ్గిస్తుంది. దీనికోసం ఆకులను బాగా నమిలి మింగాల్సి ఉంటుంది.
పులిచింత ఆకులతో పప్పు కూర వండుతారు. దీన్ని ఆహారంలో తీసుకుంటే ఆకలి పెరగడమే కాకుండా ఆస్తమా వంటి వ్యాధుల తీవ్రత తగ్గుతుంది.
పులిచింత ఆకులను తినడం వల్ల ముక్కు, గొంతు, మలంలోంచి రక్తం రావడం తగ్గుతుంది.