Page Loader
కడుపులో నొప్పికి మెదడులో ఒత్తిడికి సంబంధం ఉందని మీకు తెలుసా? 
కడుపు, మెదడు మధ్య సంబంధం

కడుపులో నొప్పికి మెదడులో ఒత్తిడికి సంబంధం ఉందని మీకు తెలుసా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 31, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్నిసార్లు చూడకూడనివి చూసినపుడు కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తుంటుంది. అలా ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా? మన మెదడులో కలిగే కోపం, ఆందోళన, బాధ వంటి ఎమోషన్లకు కడుపులో వ్యవస్థ అదుపు తప్పుతుంది. మెదడు ప్రభావం కడుపు మీద ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు మీకు తినాలన్న ఆలోచన కలగగానే కడుపులో రసాలు ఊరతాయి. అలాగే కడుపులో ఏదైనా సమస్య ఏర్పడినపుడు అది మెదడుకు సిగ్నల్ ఇస్తుంది. ఎలాంటి గాయం లేకుండా కడుపులో ఏదైనా అసౌకర్యంగా ఉందంటే అది మెదడులోని ఒత్తిడి, ఆందోళన వల్ల అయ్యుంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు సంబంధ ఇబ్బందులు రాకూడదంటే ఒత్తిడి, ఆందోళన ఉండకూడదని అర్థం చేసుకోవాలి.

Details

ఒత్తిడి వల్ల ఆహారనాళంలో కదలికలు 

కొందరిలో, ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు అనుకోకుండా కడుపులో నొప్పిగా అనిపిస్తుంటుంది. దీనికి కారణం ఒత్తిడి వల్ల కడుపులో వ్యవస్థ ప్రభావం చెంది ఆహార నాళం సంకోచించడం, కదలడం జరుగుతుంది. అందుకే నొప్పి కలుగుతుంది. కొందరిలో ఈ నొప్పి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. వారి కడుపు వ్యవస్థలోని ఆహార నాళం, మెదడు సూచనలకు ఎక్కువగా రెస్పాండ్ కావడమే దానికి కారణం. మీకు కడుపు సంబంధిత సమస్యలు అనగా, గుండెమంట, తిమ్మిర్లు, పొత్తికడుపులో నొప్పి, నీళ్ళ విరేచనాలు ఉన్నట్లయితే అది ఒత్తిడి కారణంగా ఏర్పడిందా లేదా అనేది తెలుసుకోవాలి. దీనికొరకు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.