Page Loader
మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు
చక్కెర ఎక్కువ తింటే శరీరంలో కలిగే అనర్థాలు

మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 18, 2023
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహార అలవాట్లలో అనేక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మొదలగునవన్నీ చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్యను పెంచుతాయి. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఒకరోజులో 30గ్రాముల చక్కెర కంటే ఎక్కువ తినకూడదట. ఐతే చక్కెర ఎక్కువ తీసుకుంటే బాడీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. అలసట: ఏ పనీ చేయకున్నా శరీరం అలసిపోతుంటే మీరు చక్కెర విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలసట అనేది చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల కలుగుతుంది. బరువు పెరగడం: చక్కెర వల్ల ఎదురయ్యే మరో సమస్య బరువు పెరగడం. బరువు తగ్గాలంటే చక్కెరను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.

ఆరోగ్యం

బీపీ ని పెంచి గుండెకు చేటు చేసే చక్కెర

ఆకలి పెరగడం: చక్కెర పోషకాలు ఎక్కువగా ఉండవు కాబట్టి మీకు ఆకలి ఎక్కువగా అవుతుంది. ఫైబర్ లాంటి కడుపును నిండుగా ఉంచే పోషకాలు అందనందువల్ల ఆకలి అధికంగా అవుతుంది. బీపీ పెరగడం: ఉప్పు తింటే మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకున్నా కూడా బీపీ బాగా పెరుగుతుంది. దీన్ని మీరు పట్టించుకోకపోతే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనసు మారిపోవడం: మీకు తెలియకుండానే మీ మనసు మారిపోతుంటుంది. చికాగ్గా, ఏమీ చేయాలనిపించక, ఏదేదో ఐపోతుంటుంది. ఇలాంటి టైమ్ లో చక్కెర గురించి ఆలోచించాలి. చర్మం దెబ్బతినడం: చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల చర్మం మీద జిడ్డుదనం ఎక్కువగా ఏర్పడుతుంది. దానివల్ల మొటిమలు కలుగుతాయి.