
ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం పొందడానికి పనికొచ్చే ఇంటి చిట్కాలు
ఈ వార్తాకథనం ఏంటి
వాతావరణంలో మార్పులు వచ్చినపుడు జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు చాలా కామన్ గా వస్తుంటాయి. ముక్కుదిబ్బడ వల్ల నిద్ర సరిగ్గా పట్టదు.
ముక్కు బరువుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ముక్కుదిబ్బడ సమస్య నుండి బయట పడటానికి కొన్ని ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అల్లం టీ:
మంచి అల్లం టీ తాగితే ముక్కుదిబ్బడ సమస్య దూరమవుతుంది.
టీ వద్దనుకుంటే అల్లం ముక్కలను నీళ్ళలో ఉడకబెట్టి చిన్నపాటి గుడ్డముక్కను ఆ నీళ్ళలో ముంచి ముక్కు మీద ఉంచుకోవాలి..
ప్రతీ 15నిమిషాలకు ఒకసారి ఇలా చేస్తే ముక్కుదిబ్బడ తగ్గిపోయి హాయిగా ఉంటుంది.
Details
ఆవిరితో ముక్కుదిబ్బడ మాయం
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లో యాంటీ బాక్టీరియా పోషకాలు ఉంటాయి. గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ పోసుకుని రోజుకు మూడు సార్లు తాగితే ముక్కుదిబ్బడ సమస్య తొలగిపోతుంది.
వేడినీటి స్నానం:
వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలా కాదనుకుంటే నీళ్లను బాగా మరిగింది ఆవిరి పట్టుకుంటే కూడా ముక్కుదిబ్బడ సమస్య దూరమవుతుంది.
నిద్రపోయే స్థితిని మార్చుకోవడం:
నిద్రపోయే పొజిషన్ సరిగ్గా లేకపోతే మూసుకుపోయిన ముక్కురంధ్రాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముక్కుదిబ్బడ సమస్య ఉన్నప్పుడు తలకింద మరో దిండును పెట్టుకోండి. తలభాగం ఎత్తుగా ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ ఇబ్బంది పెట్టదు.