Summer Drinks: వేసవికాలంలో జీర్ణక్రియ సమస్యలు తొలగాలంటే.. ఈ డ్రింక్స్ త్రాగండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఎండాకాలం ప్రారంభం అవుతోంది.వేసవిలో తీవ్రమైన చెమటల కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.
అలాగే, అలసట కూడా పెరుగుతుంది. వేసవిలో మన రోగనిరోధక వ్యవస్థతో పాటు, జీర్ణవ్యవస్థలో కూడా అనేక మార్పులు జరుగుతాయి.
దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు పెరిగిపోతాయి. అతిసారం, UTI, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
ఈ సమస్యలను నివారించడానికి, కడుపును శాంతపరిచే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
వేసవిలో జీర్ణక్రియను మెరుగుపరచి, డీహైడ్రేషన్ సమస్యను తగ్గించే ఉత్తమమైన పానీయాల గురించి ఈ కథనంలో చదవండి.
వివరాలు
మజ్జిగ
వేసవి పానీయాల జాబితాలో మొదటి స్థానంలో మజ్జిగ ఉంది. వేసవిలో మజ్జిగ తాగే వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటాయి, ఇవి గట్ ఆరోగ్యానికి మంచివిగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, B12 వంటి విటమిన్లు కూడా ఉంటాయి.
ఇవి శరీరాన్ని, మనసును శాంతపరచడమే కాకుండా వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.
మజ్జిగకు ఇష్టములేకపోతే, స్మూతీ లేదా పండ్ల ముక్కలతో కలిపి ప్రయత్నించవచ్చు. రోజూ కనీసం ఒక గ్లాసు మజ్జిగ తాగడం మంచి అలవాటుగా మార్చండి.
వివరాలు
నిమ్మరసం
వేసవిలో నిమ్మరసం కలిపిన నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మరసంలో ఉన్న యాసిడ్స్ జీర్ణ ప్రక్రియకు సహాయపడతాయి, కాబట్టి ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తక్కువవుతాయి.
వేసవి కాలంలో శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది, దానిని నియంత్రించడానికి ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగడం చాలా ఉపయోగకరమైన అలవాటుగా ఉంటుంది.
సబ్జాగింజల నీటిలో నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.
వివరాలు
కొబ్బరి నీళ్లు
వేసవిలో UTI, మూత్రవిసర్జనలో మంట వంటి సమస్యలు పెరిగిపోతాయి. ఈ సమస్యలకు కొబ్బరి నీళ్లు చాలా సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరచి, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 9% ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఎసిడిటీ వేధిస్తుంటే, కొబ్బరి నీళ్లతో ఉపశమనం లభిస్తుంది.
చెరకు రసం
ఎండాకాలంలో చెరకు రసం తాగడం అలసట మరియు నిస్సత్తువను పోగొట్టేందుకు సహాయపడుతుంది.
ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. చెరకు రసంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
వేసవిలో మలబద్ధక సమస్యను నివారించడానికి చెరకు రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వివరాలు
పటికబెల్లం వేసిన పాలు
వేసవిలో అధిక వేడి కారణంగా పిత్త దోషం ఏర్పడుతుంది. అందువల్ల, పడుకునే ముందు పటికబెల్లం వేసిన పాలు తాగితే శరీరాన్ని చల్లబరచుతుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది.
అరటిదిండు రసం
అరటిదిండు రసం అనేక పోషకాలను అందిస్తుంది. దీనిలో పొటాషియం, విటమిన్ B6, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
అరటిదిండు రసంలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
కడుపు ఉబ్బరం, మలబద్ధకంలాంటి సమస్యలను నివారించడంలో అరటిదిండు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.