Page Loader
Valentines Day: స్టైలిష్‌గా మెరిసిపోవడానికి టాప్ ఫ్యాషన్ చిట్కాలు!
స్టైలిష్‌గా మెరిసిపోవడానికి టాప్ ఫ్యాషన్ చిట్కాలు!

Valentines Day: స్టైలిష్‌గా మెరిసిపోవడానికి టాప్ ఫ్యాషన్ చిట్కాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి నెల ప్రేమ మాసంగా పేరుగాంచింది. ప్రస్తుతం ప్రేమ వారం కొనసాగుతోంది, ఇది రోజ్ డేతో ప్రారంభమై, ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమికులు ఈ ప్రత్యేక రోజును ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రేమ పక్షులు ముందుగానే ఈ రోజు కోసం సిద్దమవుతారు. వాలెంటైన్స్ డే రోజున జంటలు డేట్‌కు వెళతారు లేదా స్నేహితులతో నైట్ అవుట్‌ను ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రోజు స్టైలిష్‌గా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. మీరు కూడా మీ ప్రేమికుడితో డేట్‌కు వెళతారనుకుంటే, ఈ ఫ్యాషన్ హ్యాక్స్ మీ లుక్‌ను మరింత మెరుగుపరచటమే కాకుండా, డబ్బును కూడా ఆదా చేసేలా ఉంటాయి.

వివరాలు 

స్టైలిష్ వాలెంటైన్స్ డే లుక్ కోసం టాప్ ఫ్యాషన్ టిప్స్ 

1. క్లాసిక్ రెడ్ టాప్ మీ దగ్గర రెడ్ కలర్ టాప్ ఉంటే, వాలెంటైన్స్ డే కోసం అదృష్టమే! ఈ టాప్‌ను బేజ్ మినీ స్కర్ట్, మోకాళ్ల వరకూ ఉండే కిట్టెన్ బూట్లతో జత చేయండి. అదనంగా, ట్రెండీ స్లింగ్ బ్యాగ్‌ను క్యారీ చేయడం స్టైలిష్ లుక్‌కు తోడ్పడుతుంది. జుట్టును హాఫ్ బన్‌లో స్టైల్ చేస్తే మరింత క్యూట్‌గా కనిపిస్తారు. బేజ్ స్కర్ట్ అందుబాటులో లేకపోతే, బ్లాక్ లేదా ఆఫ్ వైట్ స్కర్ట్‌తో కూడా అదిరిపోయే లుక్ పొందవచ్చు.

వివరాలు 

స్టైలిష్ వాలెంటైన్స్ డే లుక్ కోసం టాప్ ఫ్యాషన్ టిప్స్ 

2. షిమ్మరి షైనింగ్ డ్రెస్ మీరు రాత్రి డేట్‌కు వెళతారంటే, మెరిసే షైనింగ్ డ్రెస్ ఉత్తమమైన ఎంపిక.ఈ డ్రెస్‌ను బోల్డ్ ఈయర్ రింగ్స్,స్టైలిష్ సిల్వర్ లేదా గోల్డ్ హీల్స్‌తో కాంబినేషన్ చేయండి. మేకప్‌ను న్యూడ్‌గా ఉంచి, లిప్‌స్టిక్‌ను డ్రెస్ కలర్‌కు తగినట్లుగా ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. 3. కార్సెట్ టాప్ లుక్ మోకాళ్ల వరకూ ఉండే డెనిమ్ స్కర్ట్‌తో కార్సెట్ టాప్ ధరిస్తే,స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా,ట్రెండీ లుక్ కూడా సొంతం అవుతుంది. దీన్ని క్రాప్డ్ బాంబర్ జాకెట్ & వైట్ స్నీకర్స్‌తో కాంబినేషన్ చేయవచ్చు.లేదా లాంగ్ కోట్ & స్టిలెట్టోస్‌తో జత చేసి మరింత ఎలిగెంట్ లుక్ పొందొచ్చు.జుట్టును కర్ల్ చేసి వదిలేస్తే మరింత ఫ్యాషన్ టచ్ వస్తుంది.

వివరాలు 

స్టైలిష్ వాలెంటైన్స్ డే లుక్ కోసం టాప్ ఫ్యాషన్ టిప్స్ 

4. ప్లెయిన్ రెడ్ డ్రెస్ - ఎప్పుడూ ట్రెండింగ్! వాలెంటైన్స్ డే రోజు రెడ్ కలర్ డ్రెస్ ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. దీన్ని ఓపెన్ హెయిర్, న్యూడ్ మేకప్, స్టడ్ ఈయర్ రింగ్స్, హై హీల్స్‌తో కాంబినేషన్ చేస్తే మిలియన్ బక్స్ లుక్ వస్తుంది! అదనంగా, స్లింగ్ బ్యాగ్ జతచేస్తే లుక్ మరింత హైలైట్ అవుతుంది. ఈ ఫ్యాషన్ చిట్కాలను పాటించి, వాలెంటైన్స్ డే రోజున మరింత స్టైలిష్‌గా మెరిసిపోండి!