MOST ROMANTIC CITIES : ప్రపంచంలోని 10 అత్యంత రొమాంటిక్ నగరాలు ఇవే
ప్రియమైన వారితో మరపురాని అనుభూతిని పొందేందుకు ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశాలున్నాయి. భాగస్వామితో వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి ఈ ప్రదేశాలను తమ డెస్టినేషన్లుగా ఎంచుకోవచ్చు. ప్రేమ స్మారక చిహ్నాలు, బీచ్‌లు, అందమైన లోయలు, పర్వతాలు, మైమరపించే ప్రపంచంలోని 10రొమాంటిక్ నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. బియారిట్జ్ బియారిట్జ్ సిటీ నిర్మాణం బెల్లె పోక్ జీవనశైలిలో కనిపిస్తుంది. దీన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నెపోలియన్, సముద్రతీర రిసార్ట్‌లలో ఒకటిగా మల్చారు. 2. సెవిల్లె డాన్ జువాన్, బిజెట్ కార్మెన్ ఇద్దరూ సెవిల్లె నుంచి వచ్చిన విషాద ప్రేమికులు. 2000 ఏళ్ల పురాతన స్పానిష్ నగరం ఇది. రొమాంటిక్ నగరంగా పేరు పొందింది.
ప్రేమను వ్యక్త పర్చుకునేందుకు రోమాంటిక్ సిటీస్
3. ఫీస్ 800 ఏళ్ల నాటి టైల్‌వర్క్‌తో మనోహరంగా తీర్చిదిద్దిన నగరం ఇది. మనస్సుకు హాయిని కలిగించే ప్రాంతంగా పేరుగాంచింది. 4. ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్‌లో అందమైన ప్రదేశాలు ఎక్కువ. ఇక్కడ వాటిని చూడకుండా అడుగు కూడా వేయలేం. ఈ నగరంలోని ప్రతి అంగుళం ప్రియమైన వారికి ప్రేమను తెలియపర్చేలా ఉంటుంది. 5. శాన్ సెబాస్టియన్ ఇతర నగరాల కంటే ఇది ప్రేమను వ్యక్తపర్చడానికి మంచి డెస్టినేషన్. ఇక్కడ మిచెలిన్ నక్షత్రాలు ప్రత్యేకం. ఇక్కడ షికారు మాత్రమే కాదు.. అద్భుతమైన భోజనం అందుబాటులో ఉంటుంది. 6. బుడాపెస్ట్ పారిస్‌లో ఇదొక పురాతన నగరం. ప్రేగ్, వెనిస్‌ల లాగే ఇదో సుందరమైన పట్టణం. ఇక్కడి నది వెంట షికారు చేస్తూ ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తపర్చుకోవచ్చు.
అత్యుత్తమ శృంగారభరితమైన అనుభూతి కోసం డుబ్రోవ్నిక్
7. వాలెట్టా మాల్టా సుందరమైన రాజధాని వాలెట్టా. దీన్ని ద్వీపంలోని హెడ్‌ల్యాండ్‌లో నిర్మించారు. యూరప్ సాంస్కృతిక రాజధాని. ఇక్కడ కళాత్మకమైన ప్రదేశాలు ప్రేమికులకు ఇష్టపడేరీతిలో ఉంటాయి. 8.ట్యునీషియా ఎడారిలో చాలా శృంగారభరితమైన ప్రదేశంగా దీనికి గుర్తింపు. టోజూర్‌కు వెళ్లేందుకు ఉత్తమ మార్గంగా, ఎండిపోయిన ఉప్పు సరస్సు, చోట్ ఎల్ జెరిడ్ చుట్టూ విదేశీ ప్రకృతి దృశ్యాన్ని చూడొచ్చు. 9. డుబ్రోవ్నిక్ సుందరమైన పురాతన కోట లాంటి గోడలను కలిగి ఉంది.ఇక్కడి సముద్రం మంత్రముగ్ధులను చేస్తుంది.తెల్లటి కోట గోడలతో ఉన్న ఈ నగరంలో అత్యుత్తమ శృంగారభరితమైన అనుభూతిని పొందడం ఖాయం. 10. బెల్జియం బ్రూగెస్ క్యాండిల్‌లైట్ డిన్నర్లు, విలాసవంతమైన వసతి, బీచ్‌లో సుదీర్ఘ నడకలు గుర్తుకు వస్తాయి. గుర్రపు బండిలో ప్రయాణం మధురానుభూతిని ఇస్తుంది.