
Oils For Joint Pains : మోకాళ్లకు, కీళ్ల నొప్పులకు ఈ తైలం రాస్తే నొప్పులు మాయం
ఈ వార్తాకథనం ఏంటి
మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దైనందిన జీవితంలో సాధారణ కార్యకలాపాలను కూడా ఈ నొప్పులు అడ్డుకుంటాయంటే అతిశయోక్తి కాదు.
వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇక వయసు మళ్లిన వారికైతే చెప్పక్కర్లేదు.
ఇలాంటి వారు పలు రకాల నూనెల్ని నొప్పి తగ్గించుకునేందుకు వినియోగించుకోవచ్చు. మార్కెట్లో తేలికగా దొరికే కొన్ని తైలాలను ఉపయోగిస్తే ప్రభావవంతంగా నొప్పులను తగ్గిస్తుంది. ఈ మేరకు ఆయుర్వేద వైద్యులు, నిపుణులు అంటున్నారు.
1. లావెండర్ నూనె :
సువాసన గల అత్యవసర నూనెగా దీనికి పేరుంది. దీనికి వాపులను తగ్గించే గుణాలున్నాయి. ఫలితంగా ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయని అధ్యయనాల్లో తేలింది.
details
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో వాపులు, నొప్పులు తగ్గుతాయి
2. నల్ల జీలకర్ర నూనె :
ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు ఇది గొప్ప ఔషధంగా భావిస్తారు. దీంతో నొప్పులు తగ్గిపోతాయి. రోజుకు 3 సార్లు రాసుకుంటే తలనొప్పి, నడుము నొప్పులతో పాటు ఇన్‌ఫెక్షన్లను దూరం చూస్తుంది.
3. అల్లం నూనె :
ఆర్థరైటిస్ నొప్పులపై జింజర్ ఆయిల్ ప్రభావం ఎక్కువే. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో వాపులు, నొప్పులు తగ్గుతాయి.
ఆర్థరైటిస్, దీర్ఘకాలిక కీళ్ల వాపులపై ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తోందని 2016లో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
నొప్పి ఉన్న ప్రాంతంలో 4 చుక్కల అల్లం నూనెను తీసుకుని సున్నితంగా మర్దన చేసుకుంటే సరి.
details
వరుసగా 30 రోజుల పాటు లెమన్ గ్రాస్ నూనె రాయాలి
4. యూకలిప్టస్ నూనె :
యూకలిప్టస్ చెట్టు నుంచి తీసే ఈ ఆయిల్ లో నొప్పి నివారణ గుణాలున్నాయి. మోకాళ్లు, కీళ్లుతో పాటు కండరాల నొప్పులు, బెణుకులు, నరాల నొప్పులపై బాగా పని చేస్తుంది.
నాలుగైదు చుక్కల నూనెను తీసుకుని నొప్పి ప్రాంతంలో మసాజ్ చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది.
5. లెమన్ గ్రాస్ ఆయిల్ :
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో ఇబ్బంది పడే వారికి వరుసగా 30 రోజుల పాటు లెమన్ గ్రాస్ నూనె రాసుకుంటే చక్కని ఫలితాలు రాబట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అనంతరం వారిలో నొప్పులు తగ్గినట్లు ఓ అధ్యయనంలో స్పష్టమైంది. ఇందులోని వాపుల్ని తగ్గించే లక్షణాలతో నొప్పుల్ని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది.