
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఐరన్ సప్లిమెంట్స్ ఉపయోగాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఐరన్ అనే పోషకం శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలామందికి తెలియదు. మన శరీరంలో ఐరన్ తగినంతగా లేకపోతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సాధారణంగా ఐరన్ లోపం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఐరన్ సప్లిమెంట్స్ వాడటం తప్పనిసరి. ఐరన్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలో ఇక్కడ చూద్దాం.
హీమోగ్లోబిన్ ని పెంచుతాయి:
ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమో గ్లోబిన్ అనే ప్రోటీన్ ని ఉత్పత్తి చేయడంలో ఐరన్ చాలా కీలకంగా ఉంటుంది. రక్తం ద్వారా ఆక్సిజన్ ని అన్ని శరీర అవయవాలకు చేరుస్తుంది హీమోగ్లోబిన్.
ఐరన్ స్థాయిలు తక్కువ కావడం వల్ల శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్యం
ఐరన్ సప్లిమెంట్స్ వల్ల కలిగే లాభాలు
చురుకుదనాన్ని పెంచుతాయి:
ఐరన్ తక్కువైతే శరీర అవయవాలకు సరైన ఆక్సిజన్ అందదు. అలాంటప్పుడు శరీరం బలహీనంగా మారిపోతుంది. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
ఐరన్ సప్లిమెంట్స్ వల్ల కలిగే మరో లాభం రోగనిరోధక శక్తి పెరగడం. రక్తంలోని మలినాలను బయటకు పోగొట్టడంలో ఐరన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాదు రకరకాల వైరస్ లు, బాక్టీరియాలు.. శరీరాన్ని పాడుచేయకుండా ఐరన్ చూసుకుంటుంది. ఐతే వీటిని ఎలా వాడాలనేది డాక్టర్ ద్వారా తెలుసుకోవాలి.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:
ఐరన్ లోపం వల్ల ఒక పనిమీద సరైన దృష్టి ఉండదు. ఐరన్ సప్లిమెంట్స్ కారణంగా దీన్నుండి బయటపడవచ్చు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందినపుడు దాని పనితీరు మెరుగుపడుతుంది.