ఆరోగ్యం: మిమ్మల్ని మీరు పట్టించుకుంటే జనాలు తప్పుగా ఆలోచిస్తున్నారా? ఇది చదవండి
మిమ్మల్ని మీరు పట్టించుకోవడమనేది స్వీయ రక్షణ కిందకు వస్తుంది. అంటే సెల్ఫ్ కేర్ అన్నమాట. మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉంచుకోగలగడం. ఐతే ఈ స్వీయ రక్షణ విషయంలో జనాల్లో కొన్ని అపోహలున్నాయి. అవేంటో చూద్దాం. అపోహా: స్వీయ రక్షణ ఆడవాళ్లకు మాత్రమే ఆడవాళ్ళకు మాత్రమే స్వీయరక్షణ అవసరమని చాలామంది అనుకుంటారు. సమాజంలో ఎదురయ్యే అనేక విషయాల నుండి తమని తాను రక్షించుకోవడానికి ఆడవాళ్లకు స్వీయరక్షణ అవసరమని అనుకుంటారు. ఆడవాళ్ళకు మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా సమాజంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అపోహా: స్వీయరక్షణ స్వార్థంతో సమానం తన గురించి తాను ఆలోచించడం స్వార్థం కానే కాదు. మీకంటూ మీరు కొంత సమయం ఇచ్చుకోవాలి. అది స్వార్థం కాదు.
స్వీయ రక్షణపై జనంలో ఉన్న అపోహలు
అపోహ: స్వీయరక్షణ కేవలం మానసిక ఆరోగ్యం కోసమే మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్ గా మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వీయరక్షణ అవసరం. ఉదాహరణకు మీరు వ్యాయామం చేస్తే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. అప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అపోహ: ఆనందంగా ఉంచే ప్రతీదీ స్వీయరక్షణలో భాగమే కాదు, ఆల్కహాల్, డ్రస్ మీకు ఆనందం ఇస్తాయి కావచ్చు, కానీ అది స్వీయరక్షణ అనిపించుకోదు. దానివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. రేపు మీకేం కాకూడదన్న ఉద్దేశ్యంతో ఈరోజు మీరు చేయాల్సిన పనులే స్వీయ రక్షణ అనుకోవాలి. వెంటనే వచ్చే ఆనందం రేపటి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.