Page Loader
గృహం: పాత వస్తువులను అవతల పారేస్తున్నారా? ఈ విధంగా వాడితే బాగుంటుంది 
పాడైపోయిన వస్తువులను అవతల పారేకుండా చేయాల్సిన పనులు

గృహం: పాత వస్తువులను అవతల పారేస్తున్నారా? ఈ విధంగా వాడితే బాగుంటుంది 

వ్రాసిన వారు Sriram Pranateja
May 22, 2023
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాడైపోయిన బాటిల్స్, బట్టలు, ఇంకా అనేక ఇతర సామాన్లను ప్రతీసారీ బయట పారేస్తున్నారా? పాత వస్తువులను వేరే ఇతర ప్రయోజనాలకు వాడవచ్చు. దీనివల్ల భూమి మీద చెత్త తగ్గుతుంది, అలాగే మీకు కొత్తవి కొనే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం, పాడైపోయిన వస్తువులతో వివిధ పనులకు ఉపయోగపడే వస్తువులను ఎలా తయారు చేయాలో చూద్దాం. పాత టైర్లు: పాత టైర్లకు కొత్తగా రంగులేసి మీ తోటలో చిన్న టేబుల్ లాగా వాడవచ్చు. రెండు మూడు టైర్లను ఒకదాని ఒకటి వేసి, వాటిమీద ఒక చెక్కను పరిస్తే టేబుల్ లాగా ఉంటుంది. అలా కాదనుకుంటే మీ పెంపుడు జంతువులు కుక్కలకు, పిల్లలకు.. పాత టైర్లలో నివాసం ఏర్పాటు చేయవచ్చు.

Details

పక్షులకు ఆహారాన్ని అందించే పాత్రల తయారీ 

ఎగ్ కార్టన్స్: గుడ్లను భద్రపరిచే కార్టన్లను పాడేయకుండా వాటిని ఇంట్లోనే ఉంచుకుని వాటిల్లో చిన్న చిన్న వస్తువులను ఉంచితే బాగుంటుంది. మీ గార్డెన్ లో మొక్కలను పెంచాలనుకుంటే, ఎగ్ కార్టన్లలో చిన్న విత్తనాలను మొలకెత్తించవచ్చు. పాత బట్టలు: పాత బట్టల్ని పాడేయకుండా రకరకాలుగా ఉపయోగించవచ్చు. మీరు రెగ్యులర్ గా వేసుకునే ప్యాంటులకు కొత్త లుక్ ఇవ్వాలంటే, పాత బట్టల నుండి కొద్దిగా కత్తిరించి, మీరు వేసుకునే బట్టలకు కుట్టవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ : ప్లాస్టిక్ బాటల్స్ తో చాలా తయారు చేయవచ్చు. బాటిల్స్ లో మొక్కలు పెంచవచ్చు. తోటలోని మొక్కలని నీళ్ళు పోసే పరికరంగా తయారుచేయవచ్చు. అలాగే పక్షులకు ఆహారం అందించడానికి ఉపయోగించవచ్చు.