పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
పంటికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడతాయి. ఈ నొప్పి కారణంగా అనవసర చిరాకు కలుగుతుంది. రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టదు. అయితే ఈ పంటి నొప్పిని తగ్గించడానికి అనేక ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. ప్రస్తుతం అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఐస్ ప్యాక్: చిగుళ్ళు వాచిపోవడం, గాయాలు కావడం వల్ల పంటి నొప్పి కలిగినట్లయితే ఐస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ చెంప బయట భాగము నుండి ఐస్ ప్యాక్ తో మర్దన చేస్తే నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల చిగుళ్ల వాపు తగ్గుతుంది.
పంటినొప్పిని తగ్గించే లవంగం నూనె
ఉప్పు నీళ్లు: పంటిలో ఏదైనా చెత్త ఇరుక్కుపోయి నొప్పిగా ఉన్నట్లయితే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించి ఉమ్మితే నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుంది. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి: ఒక తాజా వెల్లుల్లిపాయను తీసుకుని నలగ్గొట్టి దానికి కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న పంటికి పెట్టాలి. దీనివల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనె: మార్కెట్లో దొరికే లవంగం నూనె తీసుకొని నొప్పిగా ఉన్న పంటిపై దూది సాయంతో రుద్దండి. లవంగం నూనెలోని పోషకాలు నొప్పిని తగ్గిస్తాయి. బేకింగ్ సోడా: టూత్ పేస్ట్ పైన బేకింగ్ సోడా కలుపుకుని పళ్ళు తోమడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.