మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను ఒక్క రాత్రిలో పోగొట్టే ఇంట్లోని వస్తువులు
రెండు మూడు రోజుల్లో పెళ్ళనగా అనుకోకుండా మీ ముఖం మీద మొటిమలు వచ్చాయనుకోండి. అది పగిలిపోయి ఎర్రటి మరకలా మారిందనుకోండి. మీకెలా ఉంటుంది. ఆ మరకలను తొందరగా ఎలా పోగొట్టుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. దానికోసం మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మొటిమల వల్ల కలిగిన ఎర్రటి మరకలను పోగొట్టే చిట్కాలు మీము మీకు తెలియజేస్తాం. కలబంద రసం: ఇందులో ఉన్న పోషకాలు మొటిమల వల్ల కలిగిన మరకను దూరం చేస్తుంది. రోజూ రాత్రిపూట కలబంద రసాన్ని మొటిమల మీద మర్దన చేసి తెల్లారాక శుభ్రంగా కడగాలి. టీ ట్రీ ఆయిల్: దీన్ని రాత్రిపూట మొటిమల మరకల మీద మర్దన చేస్తే, తెల్లారే సరికల్లా ఫలితం వస్తుంది. ఎర్రని మరకలు తొలగిపోయి అందంగా కనిపిస్తారు.
మొటిమలకు కారణమయ్యే జిడ్డుదనాన్ని తగ్గించే సిట్రికామ్లం
ఆపిల్ సైడర్ వెనిగర్: ఇందులో ఉండే సిట్రికామ్లం కారణంగా ఎర్రటి మరకలు ఈజీగా దూరమవుతాయి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొంత నీళ్ళు కలిపి మొటిమల మరకల మీర మర్దన చేయాలి. అంతే. నిమ్మరసం, బాదం నూనె, తేనె: ఈ మూడింటినీ ఒకే దగ్గర కలిపి మొటిమల మీద మర్దన చేయండి. ఉదయం వరకు మొటిమల మరకలు మాయమై మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. సిట్రికామ్లం కారణంగా జిడ్డుదనం తొలగిపోయి మొటిమలు ఏర్పడకుండా అవుతుంది. సముద్రపు ఉప్పు: దీన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మొటిమల మరకల మీద మర్దన చేసి వదిలేయండి. తెల్లారాక శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి.