కొబ్బరి చిప్పలతో తయారయ్యే వస్తువులతో ఇంటిని అందంగా అలంకరించండి
ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి, మీ ఇంటిని అందంగా మారుస్తుందని మీకు తెలుసా? కొబ్బరిని తినేసి చిప్పను పారేసే అలవాటు మీకుంటే, వెంటనే దాన్ని మానివేయండి. మీ ఆలోచనలకు పదును పెట్టి కొబ్బరి చిప్పతో అదిరిపోయే వస్తువులు తయారు చేయండి. సెంటెడ్ క్యాండిల్స్: కొబ్బరికాయను సగానికి కోసేసి, అందులోని కొబ్బరిని పూర్తిగా తీసివేయాలి. కొంచెం మైనం, కొంచెం నూనె తీసుకుని రెండింటినీ బాగా వేడిచేయాలి. ఇప్పుడు మైనాన్ని కొబ్బరిలో పోసి వెలిగించడమే. సబ్బు గిన్నె: కొబ్బరికాయను రెండు సమాన భాగాలుగా కోసి, కొబ్బరిని తీసేసి, కొబ్బరి పై భాగాన్ని కూడా బాగా రుద్ది కొబ్బరి అడుగు భాగానికి రెండు రంధ్రాలు చేయాలి. సబ్బుకు అంటుకున్న నీళ్ళు కారిపోయేలా చేస్తే సరిపోతుంది.
కొబ్బరి చిప్పలతో తయారయ్యే అలంకరణ వస్తువులు
లాంతరు: కొబ్బరికాయను తీసుకుని పై నుండి చిన్న రంధ్రం చేసి కొబ్బరిని తీసివేయండి. కొబ్బరి పై భాగాన్ని నున్నగా చేయండి. ఇపుడు కాంపాస్ పెన్సిల్ తో కొబ్బరి పై భాగంలో డిజైన్ మాదిరిగా రంధ్రాలు చేయండి. ఆ తర్వాత కొబ్బరి చిప్పకు రంధ్రం మరింత పెద్దగా చేసి అందులో లైట్ ని వెలిగించండి. బియ్యం పాత్రలు: కొబ్బరి రెండు ముక్కలుగా కోసి, పూర్తి కొబ్బరిని తీసేసి, ఆ తర్వాత కొబ్బరి చిప్ప పై భాగాన్ని నున్నగా తయారు చేయాలి. ఇప్పుడు ఈ రెండు కొబ్బరి చిప్పలను బియ్యం పాత్రల్లాగా ఉపయోగించవచ్చు. సంచిలోంచి రైస్ ని తీయడానికి గ్లాస్ ఉపయోగించే బదులు దీన్ని వాడవచ్చు.