
ఎండ రాకపోయినా మీ తోటను అందంగా మార్చే గులాబీ చెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
మొక్కలు పెంచాలంటే సూర్యకాంతి ఖచ్చితంగా అవసరం. ఐతే మన పట్టణ ప్రాంతాల్లో ఇరుకుఇరుకుగా ఉండే ఇళ్ళ మధ్య సూర్యకాంతి ఇంట్లోకి రావడం కష్టం. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ లో మొక్కలు పెరగలేవు.
ఈ టైమ్ లో కొన్ని గులాబీ చెట్లు మీ తోటను అందంగా మారుస్తాయి. తగిన సూర్యకాంతి పడకపోయినా ఈ చెట్లు పెరుగుతాయి, పూస్తాయి.
ఐస్ బర్గ్:
తెల్ల గులాబీలను పూచే ఈ చెట్టుకు ఎక్కువ ఎండ అవసరం లేదు. ఆరు అడుగుల ఎత్తువరకు పెరిగే ఈ చెట్లు, వర్షాకాలంలో పూలను పూస్తాయి. వైట్, రెడ్, పింక్ కలర్ పూలను పూచే చెట్లు కూడా దొరుకుతాయి. ఈ పూలకు మంచి సువాసన ఉంటుంది.
గులాబీ మొక్కలు
తక్కువ కాంతిలోనూ పెరిగే గుణం ఉన్న గులాబీ మొక్కలు
ఆంటోనీ మిలాండ్:
ఈ రకం గులాబీ చెట్లు రెండు కాలాల్లో పూలను పూస్తాయి. రెండు నుండి నాలుగు అడుగుల ఎత్తువరకు పెరిగడంతో పాటు 2-4సెంటిమీటర్ల వ్యాసంలో పువ్వులు పూస్తాయి. వర్షాకాలం, వేసవిలో పూలను పూస్తాయి.
ప్యాషనేట్ కిస్సెస్:
సాధారణంగా ఈ చెట్లు పెరగడానికి పూర్తి సూర్యకాంతి అవసరం. కానీ తక్కువ కాంతిలోనూ పెరిగే గుణం వీటికి ఉంది. ఐదు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. పూర్తి ఎరుపు, నారింజ రంగు పూలను పూచే వెరైటీలు దొరుకుతాయి.
రెడ్ నాకౌట్:
ఈ హైబ్రిడ్ రకం, వేసవిలో పెరుగుతుంది. కాకపోతే వర్షాకాలం నుండి చలికాలం వరకు పూలు పూసే గుణం కలిగి ఉంటుంది. ఈ గులాబీ పూల వాసన చాలా స్వీట్ గా ఉంటుంది.