వాస్తు: ఇంట్లో పెంచకూడని మొక్కల గురించి తెలుసుకోండి.
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. కొన్ని మొక్కలను ఇంటిని అలంకరించడానికి పెంచితే, మరికొన్ని మొక్కలను వాటివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల కోసం పెంచుతారు.
ఐతే కొన్ని మొక్కలను ఇంటి ఆవరణలో పెంచకూడదు. వాస్తు ప్రకారం వాటివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో పెంచకూడని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాక్టస్: ఆకుల మీద ముండ్లు ఉండే ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచకూడదు. దీనివల్ల కుటుంబంలోని వారికి యాంగ్జాయిటీ, ఒత్తిడి పెరుగుతుంది.
బోన్ సాయి: వాస్తు ప్రకారం మరుగుజ్జు మొక్కలు ప్రకృతికి విరుద్ధం. చూడడానికి అందంగా ఉండే ఈ మొక్కలు, ఇంట్లో ఉండడం వల్ల ఇంటి అభివృద్ధి జరగదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాస్తు
ఇంట్లో పెంచకూడని మరికొన్ని మొక్కలు
గోరింటాకు: పెళ్ళిళ్లకు, పండగలకు చేతులను, కాళ్ళను గోరింటాకుతో ఎర్రగా అలంకరిస్తారు. గోరింటాకు అవసరం ఆడవాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా దీన్ని ఇంట్లో పెంచవద్దు. ఈ మొక్కలో దుష్టశక్తి సంబంధిత శక్తులు ఉంటాయని నమ్ముతుంటారు.
పత్తి మొక్క: దేవుడికి దీపం పెట్టవచ్చని పత్తిమొక్కను ఇంట్లో పెంచాలని కొందరు అనుకుంటారు. చెడుశక్తిని ఇంట్లోకి తీసుకొచ్చే పత్తిమొక్కను ఇంటి ఆవరణలో ఉంచవద్దు. వాస్తు పరంగా పత్తి మొక్కను ఇంట్లో పెంచకూడదని గుర్తుంచుకోండి.
చనిపోయిన మొక్కలు: మీరు ఏదైనా మొక్కను పెంచారు. ఏవో కారణాల వల్ల ఆ మొక్క చనిపోయింది. అప్పుడు వెంటనే ఆ మొక్కను బయటపారేయాలి. దాన్ని ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది.