Araku: నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు.. ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు..
అరకు పర్యాటకులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, దాని అందాలను ఆకాశం నుంచి చూడాలనుకునే పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఈ రోజు నుండి, అరకు వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యాటకులు అరకు హిల్స్ వ్యాలీ అందాలను, మంచు తెరలను వందల అడుగుల ఎత్తు నుంచి చూస్తూ ఆనందించగలుగుతారు. ఇప్పటికే నిర్వహించిన సక్సెస్ఫుల్ ట్రయల్ రన్ తర్వాత, నిర్వాహకులు ఇవాళ్టి నుండి రెగ్యులర్ షోలు ప్రారంభిస్తున్నారు. పద్మాపురం గార్డెన్స్‌లో ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభం అవుతుంది.
శీతాకాలంలో కొండలు పసుపు వర్ణంతో అందంగా ఉంటాయి
గతంలో, అరకు ప్రదర్శన కోసం నిర్వహించిన హాట్ ఎయిర్ బెలూన్ షోలు ప్రొఫెషనల్ గానుకే జరిగాయి. కానీ ఇప్పుడు, ఈ హాట్ ఎయిర్ బెలూన్ సేవలు అందుబాటులోకి రాగానే, పర్యాటకులు అడ్వెంచర్, థ్రిల్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరకులోయ ప్రకృతి అందాలకు పేరుగాంచింది. శీతాకాలంలో వలిస పూలు పూసి కొండలు పసుపు వర్ణంతో మరింత అందంగా మారిపోతాయి. అరకు వెళ్లే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉన్న ఘాట్ రోడ్, ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు, అరకు అందాలను ఆకాశంలో నుంచి వీక్షించే అవకాశం అందుబాటులోకి రావడంతో, ఇది మరింత మంది పర్యాటకులను అరకుకు ఆకర్షించడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.