LOADING...
Fenugreek: నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు? నిపుణుల అభిప్రాయం ఇదే!
నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు? నిపుణుల అభిప్రాయం ఇదే!

Fenugreek: నానబెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతవరకు మేలు? నిపుణుల అభిప్రాయం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

చూడడానికి చిన్నగా కనిపించినా ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందించే ఆహార పదార్థాల్లో 'మెంతులు' ముందువరుసలో ఉంటాయి. ప్రాచీన కాలం నుంచే ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్న మెంతుల్లో విటమిన్‌ A, B, C, Kతో పాటు ఫైబర్‌, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మెంతులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే లభించే ఆరోగ్య లాభాలు ఇవే.

Details

షుగర్ నియంత్రణకు సాయం 

మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. వీటిలో అధికంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఆహారంలోని కార్బోహైడ్రేట్లు మరియు గ్లూకోజ్‌ త్వరగా శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే మెంతుల్లో ఉన్న '4-హైడ్రాక్సీఇసోల్యూసిన్' అనే అమినో ఆమ్లం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో, కణాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సహాయపడుతుంది. ప్రీడయాబెటిస్ ఉన్నవారు రోజుకు సుమారు 10 గ్రాముల మెంతులు తీసుకుంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

Details

జీర్ణ సమస్యలకు చెక్ 

మెంతుల్లోని పీచు పదార్థం పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. దీని వల్ల మలబద్ధకం, గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Details

బరువు నియంత్రణలో సాయం

బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. వీటిలోని ఫైబర్‌ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. దీంతో అదనపు కేలరీలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. మెంతి పొడిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కండబలం పెంపునకు ఉపయోగకరం మెంతుల్లో ఉన్న ప్రొటీన్‌, ఫైబర్‌, మెగ్నీషియం కలయిక కండరాల బలానికి ఎంతో దోహదం చేస్తుంది. వ్యాయామం తర్వాత అలసిపోయిన లేదా గాయపడిన కండరాలు త్వరగా కోలుకోవడానికి మెంతులు సహాయపడతాయని ఓ అధ్యయనం తెలిపింది.

Advertisement

Details

కొలెస్ట్రాల్ తగ్గింపులో పాత్ర 

మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లు LDL కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు వివరిస్తున్నారు.

Details

బాలింతలకు మేలు 

పాలిచ్చే తల్లులకు మెంతులు ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. మెంతులతో చేసిన టీ తాగితే తల్లిపాలు సమృద్ధిగా వస్తాయని, శిశువుల బరువు, ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే గర్భధారణ సమయంలో అవసరానికి మించిన మోతాదులో మెంతులు తీసుకోవడం సురక్షితం కాదని NIH హెచ్చరిస్తోంది. మొత్తానికి మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది నిజమే. అయితే డయాబెటిస్‌, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణులు మెంతులు తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకుని సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement