Beauty tips: చలికాలంలో చర్మాన్ని మెరిపించడానికి ఈ హోం రెమెడీస్.. మీ కోసమే..!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో చర్మం రంగు మారిపోయి, నల్లబడినట్లు, కళావిహీనంగా మారుతుంది.
ఈ కారణంగా ముఖం నీరసంగా, మసకబారినట్లు కనిపిస్తుంది. చలికాలంలో చల్లని గాలి ముఖంలోని తేమను పీల్చి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది.
దీనిని నివారించడానికి, మార్కెట్‌లో దొరికే క్రీములు, లోషన్లు వాడతారు. కానీ కొంతకాలం తర్వాత ఈ ఉత్పత్తులు చర్మాన్ని నల్లగా మార్చడం ప్రారంభిస్తాయి.
అయితే, శీతాకాలంలో చర్మ రంగును తిరిగి పొందటానికి కొన్ని సులభమైన హోమ్ రెమెడీలు ఉన్నాయి.
వివరాలు
బంగాళాదుంప రసం
బంగాళాదుంపలు ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా ఉండే పదార్థం. వీటి రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో ఉన్న నలుపుదనం తొలగిపోతుంది. ఈ రెమెడీ చేయడానికి, ముందుగా బంగాళాదుంపను సన్నగా తురుమ్ చేసి, దాని రసాన్ని తీయాలి. ఆ తర్వాత,ఈ రసాన్ని కాటన్ తో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
టమోటా రసం
టమోటా కూడా ముఖం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఈ రసం పొడి చర్మం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది.టమోటా రసం తయారు చేయడానికి, ముందుగా టమోటాను తురిమి దాని రసాన్ని తీయాలి. ఆ తరువాత ఈ రసాన్నివేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి.
వివరాలు
ముల్తానీ మట్టి
తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. టమోటాలలో ఉన్న విటమిన్ సి చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది.
ముల్తానీ మట్టిని ఉపయోగించడం ద్వారా కూడా ముఖం రంగును మెరుగుపరచుకోవచ్చు.ఈ పేస్ట్ చర్మం మీద నలుపుదనం తొలగించడానికి సహాయపడుతుంది.ముల్తానీ మట్టిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ సెప్టిక్,యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ముల్తానీ మట్టి పేస్ట్ తయారు చేయడానికి,ఒక గిన్నెలో 4 టీస్పూన్ల ముల్తానీ మట్టి,2 టీస్పూన్ల నిమ్మరసం,4 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ గ్లిజరిన్ వేసి పేస్టు తయారుచేయాలి.
ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఆ తరువాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు చేయడం ద్వారా చర్మం మెరుస్తూ ఉంటుంది.