
Gold Purity Test: బంగారం స్వచ్ఛతను ఇంట్లో ఎలా తనిఖీ చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
విలువైన లోహాలలో బంగారం ప్రముఖమైనది. ఇది సంపదకు, ప్రతిష్ఠకు సూచికగా మారింది. అయితే, మార్కెట్‌లో నకిలీ బంగారం కూడా లభిస్తుంటుంది. మీరు కొనుగోలు చేసిన బంగారం నిజమైనదా లేదా అనుమానమొస్తే, దీనిని ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవచ్చు. సాధారణమైన పద్ధతుల్లో బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
వివరాలు
ఫ్లోటింగ్ టెస్ట్
ఫ్లోటింగ్ టెస్ట్ అనేది బంగారం,ఇతర లోహాల సాంద్రత మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించే సాధారణమైన పరీక్ష. ఈ పరీక్షను ఇంట్లోనే నిర్వహించవచ్చు. ముందుగా, ఒక గిన్నెను శుద్ధమైన నీటితో నింపండి. పరీక్షించాల్సిన బంగారు ఆభరణాన్ని నీటిలో వేసి గమనించండి. నిజమైన బంగారం అధిక సాంద్రత కలిగి ఉంటుంది, కాబట్టి అది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అదే బంగారం తేలిపోతే లేదా కొంతసేపటికి పైకి వస్తే, దానిలో తేలికపాటి లోహాలను కలిపి ఉండొచ్చని అర్థం.
వివరాలు
అయస్కాంత పరీక్ష
బంగారం సహజంగా అయస్కాంత లక్షణాలను కలిగి ఉండదు,అంటే ఇది అయస్కాంతానికి ఆకర్షితమయ్యే లోహం కాదు. బలమైన అయస్కాంతాన్ని బంగారానికి దగ్గరగా పెట్టి గమనించండి.బంగారం అయస్కాంతానికి ఆకర్షితమైతే,దానిలోఇనుము లేదా ఇతర మిశ్రమ లోహాలు కలిసివుండవచ్చు. నిజమైన బంగారం అయస్కాంతానికి స్పందించదు. యాసిడ్ టెస్ట్ నైట్రిక్ యాసిడ్ ద్వారా బంగారం స్వచ్ఛతను పరీక్షించవచ్చు.మీరు పరీక్షించాలనుకునే బంగారు ఆభరణంపై ఒకచుక్క నైట్రిక్ యాసిడ్ వేసి గమనించండి. అధిక స్వచ్ఛత గల బంగారం రంగుమారదు.ఆమ్లం తాకిన వెంటనే బంగారం ఆకుపచ్చ లేదా నీలం రంగుకుమారితే,దానిలో రాగి లేదా ఇతర లోహాలు కలిసివున్నాయని అర్థం.ఎర్రటి లేదా గోధుమ రంగుకు మారితే, బంగారం 22 క్యారెట్ల కంటే తక్కువ స్వచ్ఛత గలదని అర్థం చేసుకోవచ్చు. రంగు మారకపోతే,అది నిజమైన బంగారమే.
వివరాలు
హాల్‌మార్క్ గుర్తింపు
నిజమైన బంగారం చెల్లుబాటు అయ్యే హాల్‌మార్క్ గుర్తులతో వస్తుంది. 22 క్యారెట్ల బంగారం పై "916" అని ఉంటుంది. 18 క్యారెట్ల బంగారం పై "18K" అని లిఖించి ఉంటుంది. బంగారు ఆభరణం కొనుగోలు చేసినప్పుడు హాల్‌మార్క్ గుర్తులు ఉన్నాయా లేదా పరిశీలించండి. ఈ పరీక్షల ద్వారా ఇంట్లోనే మీ బంగారం నిజమైనదా లేదా అని తెలుసుకోవచ్చు.