ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో వ్యాయామం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్నవారు ఎక్సర్సైజ్ విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయవచ్చా?
చేయవచ్చు, కానీ.. అది మీ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. ఫాస్టింగ్ వలన మీరు బాగా అలసిపోతే వ్యాయామం చేయకపోవడమే మంచిది.
ఎక్కువగా అలసిపోకపోతే, మీరు ఎలాంటి వ్యాయామాలు చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి.
వ్యాయామం తర్వాత పోషకాలు
ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం, కార్బోహైడ్రేట్లు, కండర శక్తిని పెంచే కొవ్వులు గల ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. వ్యాయామం తర్వాత సరైన పోషకాలు తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఉంటుంది.
Details
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో ఉండకూడని కఠినత్వం
కావాల్సినన్ని నీళ్లు తాగాలి
ఫాస్టింగ్ ఉన్న సమయంలో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని ముఖ్యమైన ఖనిజ లవణలు, ద్రవాలు కరిగిపోతాయి. అందువల్ల వ్యాయామం చేసే ముందు, చేస్తున్న సమయంలో, చేసిన తర్వాత.. కావాల్సినన్ని నీళ్లు తాగడం మంచిది.
ఇంకా, అరటిపండు, కొబ్బరి నీళ్ళు మొదలగునవి తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, స్థాయిలు సరిగ్గా ఉంటాయి.
తక్కువ ఎనర్జీతో చేసే వ్యాయామం
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఎనర్జీతో చేసే వ్యాయామాలు కాకుండా తక్కువ ఎనర్జీతో చేయగలిగే నడక, యోగ వంటి వ్యాయామాలు చేయడం మంచిది.
దీనివల్ల శరీరంలోని శక్తి బయటకు పోకుండా ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో వ్యాయామం విషయంలో కఠినంగా ఉండకపోవడం మంచిది.