Page Loader
STOP YAWNING : ఆవలింతలు ఎందుకు వస్తుంటాయి, వాటిని ఎలా ఆపగలుగుతాం
ఆవలింతలు ఎందుకు వస్తుంటాయి, వాటిని ఎలా ఆపగలుగుతాం

STOP YAWNING : ఆవలింతలు ఎందుకు వస్తుంటాయి, వాటిని ఎలా ఆపగలుగుతాం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనిషికి నిద్ర సరిగ్గా లేనప్పుడు ఏర్పడే ఓ సంకేతం ఆవలింత. రోజుకు 8 గంటల పాటు సరిపడ నిద్రపోయినా, ఉదయం లేవగానే ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజంతా అలసటగా అనిపిస్తోందా. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవలింతలు రావడం వల్ల ఇబ్బంది అవుతుందా ? అయితే అతిగా ఆవలింపులు వస్తే, ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. వాటిని ఆపేందుకు చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే ఆవలింతల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో రాత్రంతా ప్రశాంతంగా నిద్రిస్తారు. అదే పనిగా ఆవలింపులు వస్తే నిద్రలేకపోవడమే కారణమని ఎదుటివాళ్లు భావిస్తారు. నిరంతరం ఆవలింతల వల్ల భవిష్యత్ లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ్యన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే. అయితే సరిగ్గా నిద్రపోనప్పుడు ఆవలించడం సహజమే.

DETAILS

చాయ్ తాగడం వల్ల ఆవలింపులను అరికట్టవచ్చు

ఆవలింపులు జబ్బు కాదు కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇతరుల ముందు తరచుగా ఇలా ఆవలిస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం ఆలవాట్లలో జలుబు లక్షణాలు లేకుంటే శీతల పానీయాలు తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు. శీతల పానీయంతో ఆరోగ్యం దెబ్బతింటోంది భావిస్తే తాజా పండ్ల రసం తాగొచ్చు. ఫలితంగా శరీరంలోని అలసట మాయమవుతుంది. పండ్లు, కోల్డ్ కాఫీ లేదా వేడి వేడి చాయ్ తీసుకోవచ్చు. ఇది ఆవలింపుల సమస్యను వెంటనే తగ్గిస్తుంది. శ్వాస సమస్యలు కొన్నిసార్లు ఆవలింతలకు కారణంగా మారొచ్చు. నోరు తెరిచి శ్వాస పీల్చుతూ వదలితే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఉపిరితిత్తుల నిండా శ్వాసతో శరీరంలో అలసట తగ్గి ఆవలింపులు తగ్గుతాయి.

details

తరచుగా నీరు తాగితే ఆవలింపులు కంట్రోల్ అవ్వొచ్చు

మరోవైపు ఆవలింపులతో శరీరంలో సోమరితనం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి వెంటనే ఎవరితోనైనా మాట్లాడాలి. అందుకు కాస్త సేద తీరి ఇతరులను నవ్విస్తూ మీరు నవ్వండి. కొద్ది సేపు నడకకు వెళ్లండి. మనసు హాయిగా ఉల్లాసంగా మారుతుంది. కూర్చునే విధానంతోనూ కొన్నిసార్లు అలసిపోతాం. కాబట్టి మనసు, శరీరం రెండూ శక్తివంతమవ్వాలంటే తరచుగా మీ భంగిమను మార్చుకుంటుండాలి. నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మరొక చిట్కా ఏంటంటే మీరు ఎక్కువగా ఆవలింపులు చేస్తుంటే, తరచుగా నీరు తాగుతుండాలి. మీ ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా చేయడంతో మూడ్ మరింత ఫ్రెష్ గా మారి ఉత్సాహంగా ఉండగలుగుతాం.