LOADING...
Humanoid Robot Arrested: వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబో.. మకావులో అరెస్ట్ ఘటన వైరల్
మకావులో అరెస్ట్ ఘటన వైరల్

Humanoid Robot Arrested: వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబో.. మకావులో అరెస్ట్ ఘటన వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత గురువారం సాయంత్రం మకావులోని పాటానే ప్రాంతంలో ఉన్న లోక్ యెంగ్ ఫా యుయెన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) వెల్లడించింది. ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ వెళుతుండగా,యూనిట్రీ G1 అనే రోబో ఆమె వెనుక అకస్మాత్తుగా నిలిచింది. రోబోను గమనించిన ఆమె భయంతో "నా గుండె వేగంగా కొట్టుకుంటోంది! నీకు చేయడానికి ఇంకేమీ లేదా? ఇలా ఎందుకు భయపెడుతున్నావు? నువ్వు పిచ్చివాడివా?" అంటూ అరచినట్లు మకావ్ పోస్ట్ తెలిపింది.

వివరాలు 

రోబోను అరెస్ట్ చేయడంపై స్పందించిన నెటిజన్లు

ఈ ఘటనలో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినప్పటికీ జాగ్రత్త చర్యగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత, రోబోను అరెస్ట్ చేయడంపై పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. అలాగే పబ్లిక్ ప్లేస్ లలో భద్రత, నియంత్రణపై ఆందోళనలు వ్యక్తం చేశారు. వైరల్ వీడియోలో ఇద్దరు పోలీసులు వచ్చి రోబోను అక్కడి నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే రోబోను ఉపయోగించిన 50 ఏళ్ల వ్యక్తికి జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. అనంతరం రోబోను తిరిగి అతనికి అప్పగించారు.

వివరాలు 

రోబోను సమర్థించిన విద్యా సంస్థ ప్రతినిధి

స్థానిక ప్రసార సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,ఈ రోబోను ఒక విద్యా సంస్థ పరీక్షిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సంస్థ ప్రతినిధి టోవిన్ మాక్,టెలిడిఫుసావో డి మకావ్ (TDM)కు మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. "ఆ మహిళ నడుస్తూ మధ్యలో ఆగి ఫోన్ చూసుకుంటుండగా,రోబో ఆమెను దాటలేక వెనుకే ఆగింది. అదే సమయంలో రోబో లైట్లు వెలుగుతుండడంతో ఆమె ఒక్కసారిగా గమనించి భయపడింది. అప్పటికే రాత్రి సమయం కావడం కూడా దీనికి కారణం" అని తెలిపారు. యూనిట్రీ G1 ఒక కమర్షియల్ హ్యూమనాయిడ్ రోబో.ఇది సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. విద్యా, ప్రచార అవసరాల కోసం రూపొందించిన ఈ రోబోలో ఆధునిక అడ్డంకుల గుర్తింపు వ్యవస్థలు, డెప్త్ కెమెరాలు అమర్చారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Advertisement