Page Loader
motivation: ఒకే ప్రయత్నంలో కాకపోతే... మరో ప్రయత్నంలో తప్పకుండా విజయం!
ఒకే ప్రయత్నంలో కాకపోతే... మరో ప్రయత్నంలో తప్పకుండా విజయం!

motivation: ఒకే ప్రయత్నంలో కాకపోతే... మరో ప్రయత్నంలో తప్పకుండా విజయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఎప్పటికైనా ఫలితాన్నిస్తుంది అని డాక్టర్ అబ్దుల్ కలామ్ తన 'ఇండామిటబుల్ స్పిరిట్‌' పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. ఒకే ప్రయత్నంలో విజయంలభించకపోయినా, మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఎందుకంటే జీవితమంతా ఓటములతోనే నడుస్తుందన్న నమ్మకం తప్పు అని ఆయన పేర్కొన్నారు. కానీ మనలో చాలా మంది మొదటి ఓటమితోనే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. రెండో ప్రయత్నం చేసినా అది సగం మనసుతో చేస్తారు. దాంతో విజయం మరింత దూరమవుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది. ఓ కొండ కిందకు ఉన్న గ్రామంపై ఓసారి శత్రువులు దాడి చేసి, ఆ గ్రామానికి చెందిన ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గ్రామ ప్రజలను కలచివేసింది.

Details

ఓపిగ్గా ముందుకెళ్లాలి

ఆ బాలుడిని రక్షించాలనే ధైర్యంతో చాలా మంది గ్రామస్థులు కొండపైకి ఎక్కే ప్రయత్నం ప్రారంభించారు. కానీ అది దట్టమైన అటవీ ప్రాంతం, నిటారుగా ఉన్న కొండ. పైకెళ్లడం చాలా కష్టమైన పని. ఎప్పటికప్పుడు కిందకు జారిపోవడం, మార్గం తెలియకపోవడం, నాలుగు రోజుల్లో తీసుకెళ్లిన ఆహారం అయిపోవడం, శక్తి తగ్గిపోవడం వల్ల చివరికి వాళ్లు ప్రయత్నం ఆపేశారు. తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్లకు ఆ బాలుడి తల్లి ఎదురయ్యింది. ఆమె ఒంటరిగా కొండవైపు వెళ్తుండటం చూసిన గ్రామస్థులు, ఇది సాధ్యం కాదు, ఇంటికెళ్లు అని సూచించారు. కానీ ఆమె షాక్ ఇచ్చింది. నేను కొండపై నుంచే వస్తున్నాను అని చెబుతూ తన వీపున బిగిగా పట్టుకున్న పిల్లాడిని చూపించింది.

Details

నిబద్ధతో విజయమే లక్ష్యంగా దూసుకెళ్లాలి

ఆమె ఎలా సాధించింది అనే ప్రశ్నకు, తల్లి సమాధానం గుండెను తాకేలా ఉంది - మీకు ఆ బాలుడు గ్రామానికి చెందినవాడు. నా కొడుకు మాత్రం నా ఊపిరి. మీరు బాధ్యతగా ప్రయత్నించారు. కానీ నాకు అది బాధ్యత కంటే ఎక్కువ తృత్వం. నా ప్రాణమే అతనిలో ఉంది. అందుకే నాకు ఏదీ అసాధ్యంగా అనిపించలేదు. వాళ్లతో ధైర్యంగా మాట్లాడి నా కొడుకును తిరిగి తీసుకొచ్చాను. ఈ కథలోని తల్లి చెప్పినట్టు ప్రయత్నం అంతముముందుకు నడిపేది ఆత్మనిబ్బరమే. కలాం చెప్పిన మాటలు కూడా అదే భావాన్ని చాటుతాయి. లక్ష్యం తలపెట్టినపుడు, దానిపై నిబద్ధతను చూపిస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

Details

బతికే మార్గాన్ని చూపించాలి

ఓటమి ఒక ఆపధర్మంగా మారకూడదు. దాన్నే బలంగా మార్చుకుని, మరింత పట్టుదలతో మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడు సాధ్యమైన విజయం మనదవుతుంది. ఇక వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా చెప్పిన మరో ముఖ్యమైన అంశం కూడా ఆలోచించదగినదే. ఆయన చెబుతున్నట్టు, జాలి లేదా దయ అంటే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర యాచకులకు రెండు రూపాయలు ఇవ్వడం కాదు. ఒకరికి అయినా బతికే మార్గాన్ని చూపించగలగాలి. అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో నేర్పగలగాలి. అదే నిజమైన సాయమవుతుంది. అంతే కాదు జీవితం ఒక పోరాటం. ఒకసారి ఓడితే చాలు అనే భావనను వదిలేయాలి. మళ్లీ, మరింత విశ్వాసంతో ముందుకెళ్తే విజయాన్ని చేరుకోవచ్చు.