వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను తినండి, అనారోగ్యానికి దూరంగా ఉండండి
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో మనం ఏ ఆహరం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం
హెర్బల్ డ్రింక్స్ తీసుకోవాలి
హైడ్రేట్‌గా ఉండేందుకు కొన్నిసార్లు నీరు తీసుకుంటే మంచిది. ఒక్కొసారి నీరు కాకుండా హెర్బెల్ డ్రింక్స్ తీసుకుంటే బాడిలో ఇమ్యూనిటీ పెరిగే అస్కారం ఉంది.
సీజనల్ ఫ్రూట్స్‌లో పోషకాలు మెండు
వర్షాకాల సీజన్లో ఫ్రూట్స్ తీసుకుంటే పోషకాలు పెరగుతాయి. జామూన్, బేరి, రేగు, చెర్రీస్, పీచెస్, బొప్పాయి, దానిమ్మ ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వాటిలో ఎ, సీ,యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి పోషకాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సాయపడుతుంది.
Details
నట్స్‌తో బాడీకి అవసరమైన ప్రోటీన్లు
నట్స్ తో బలమైన పౌష్టికాహారం
నట్స్ ఎక్కువగా తింటే బాడికి బలమైన ప్రోటిన్లు అందుతాయి. హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, ఖనిజాల వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటాయి. నట్స్ ను రోజు తీసుకోవాలి
సుగంధ ద్రవ్యాలతో ఇమ్యూనిటీ పెరుగుతుంది
పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు, మూలికలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇమ్యూనిటీని పెంచుతాయి.
కూరగాయాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం
వానాకాలంలో పొట్లకాయ, కాకరకాయ, బూడిద గుమ్మడికాయ, బెండకాయ, దోసకాయలు,వంటి కూరగాయలు తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు దరి చేరవు. రెగ్యూలర్ డైట్‌లో ఈ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు, ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
Details
స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో తినడం మానేయాలి
రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో తినడం మానేస్తే మంచిది. అక్కడ ఆహరం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఆయిలీ ఫుడ్స్ తగ్గిస్తే బెటర్, వాటి వల్ల అజీర్ణం, ఉబ్బరం, విరోచనాలు వంటి ఇతర సమస్యలు వస్తాయి. ఒకసారి వాడిన నూనెని మరోసారి వాడకుంటే చూడాలి.
వర్షాకాల సీజన్లో ఉష్ణోగ్రత, తేమ కారణంగా బ్యాక్టరియా నిల్వ ఉండి వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకుకూరలను తినడానికి ముందు కూరగాయాల్ని బాగా కడగాలి. ముఖ్యంగా ఎక్కువగా వేడి చేసి ఉడికించడం చాలా ముఖ్యం. ఈ సీజన్లో నీరు కలుషితంగా ఉంది. కాబట్టి సీఫుడ్‌ని తక్కువగా తింటే అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
Details
నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది
వెల్లుల్లితో అనారోగ్య సమస్యలు దూరం
వెల్లుల్లి ఫ్లూతో పోరాడి, ఇమ్యూనిటీని పెంచుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది ఔషద లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
పాలల్లో పసుపు కలుపుకొని తాగితే మంచిది
పసుపు కూడా యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. పాలల్లో పసుపు వేసుకొని తాగితే మంచిది.
నిమ్మరసంలో సి విటిమన్
విటమిన్ సి గొప్ప మూలమైన నిమ్మకాయలు కూడా మన్‌సూన్ డైట్‌లో ఉండాలి. మనం తినే ఆహారంలో నిమ్మరసాన్ని చేర్చుకోవడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి మంచిది.