
Chanakya Niti: ఉదయం నిద్రలేవగానే ఇలా ఉంటే ఎప్పటికీ సక్సెస్ రాదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితం గురించి అనేక విలువైన విషయాలను చెప్పారు. విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా, ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే విజయానికి అవరోధం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఆ తప్పులు ఏమిటో చూద్దాం
Details
1. సోమరితనం
ఉదయం నిద్ర లేచిన వెంటనే బద్ధకంగా ఉండటం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉదయం అలసటతో పనులు వదిలేయడం వల్ల జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన స్పష్టం చేశారు. 2. ప్రతికూల ఆలోచనలు నిద్రలేవగానే నెగటివ్ ఆలోచనలకు లోనవ్వడం మంచిది కాదని చాణక్యుడు హెచ్చరించారు. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రాగానే ఆ రోజు మొత్తం ఒత్తిడి పెరిగిపోతుందని, సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని ఆయన అంటున్నారు.
Details
3. ప్రణాళిక లేకుండా రోజు ప్రారంభించడం
రోజును ఎలాంటి ప్రణాళిక లేకుండా మొదలుపెట్టకూడదని చాణక్యుడు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనులు ఏవో, వాటిని ఎలా చేయాలో ముందే ప్లాన్ చేసుకోవడం విజయానికి పునాది అని సూచించారు. 4. నిద్రలేవగానే చెడుగా మాట్లాడడం నిద్రలేవగానే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా గాసిప్ చేయడం తగదని చాణక్యుడు స్పష్టం చేశారు. అలాంటి నెగటివ్ ఎనర్జీ మనలో పెరిగి పనుల్లో విజయాన్ని దూరం చేస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు.