
Motivational: జీవితంలో హ్యాపీగా ఉండాలంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి
ఈ వార్తాకథనం ఏంటి
జీవితంలో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ సంతోషం ఒక్కరికి పరిమితం కాదు. మనం బంధువులు, మిత్రులు, స్నేహితులతో సమయాన్ని ఆనందంగా గడిపినప్పుడు మాత్రమే మన మనసు నిజంగా ఉల్లాసంగా ఉంటుంది. అయితే, ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు. కొందరితో స్నేహం మనకి హ్యాపీ అనిపిస్తే, మరికొందరితో కేవలం కొద్దిసేపు ఉన్నా కూడా మనసు ఆందోళనతో నిండిపోతుంది. కొన్ని సార్లు మనకు తెలియకుండానే కొందరి వ్యక్తులతో స్నేహం తప్పనిసరిగా చేసుకోవలసి వస్తుంది. అలాంటి సందర్భాల్లో వారితో గడిపే సమయం, మాట్లాడటం కూడా మనకి అవమానాలు, అసౌకర్యాలు తీసుకురాగలవు. కాబట్టి కొందరు వ్యక్తులు లేదా ప్రదేశాలు మనకు దూరంగా ఉండటం ఉత్తమం.
వివరాలు
ఇలాంటి సంబంధాలు ఎప్పుడూ నష్టమే..
జీవితంలో ప్రతి ఒక్కరు ఒకేసారి విజయం సాధించలేరు. మన దేశంలో ప్రత్యేకంగా, కొందరు మాత్రం ఎక్కువ శాతం ఒకరి ఎదుగుదల చూసి మరొకరు ఓర్వలేక పోతుంటారు. ఇలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు మన జీవితంలో కలుస్తూ ఉంటారు. అయితే కొందరు తో మాత్రం పక్కనే ఉంటూ చెడగొడుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడం, వారి మాటలు మనపై ప్రభావం చూపకుండా ఉండటం ఉత్తమం. అసలు వారితో స్నేహం చేసే అవసరం లేదు. ఎందుకంటే, ఇలాంటి సంబంధాలు ఎప్పుడూ నష్టమే తీసుకొస్తాయి.
వివరాలు
ప్రతి వ్యక్తికి డబ్బు కంటే ఆత్మాభిమానము, ఆత్మగౌరవం ఎక్కువ ప్రాధాన్యం
ఇళ్లలోకి మనం వెళ్ళినప్పుడు గౌరవం, ఆప్యాయత అనుభూతితో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొందరు వ్యక్తులు, వారి ఇంటికి వచ్చినప్పటికీ, గౌరవం, మర్యాద చూపకుండా ఉంటారు. ముఖ్యంగా వారి పిల్లలు సంస్కారం చూపకపోవడం వల్ల, ఆ ఇంటికి వెళ్లడం మంచిది కాదు. వారు మీకు గౌరవం ఇవ్వకపోతే, వారి తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని తప్పుగా చూసే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వారి ఇంటికి వెళ్ళడం లేదా స్నేహం కొనసాగించడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి డబ్బు కంటే ఆత్మాభిమానము, ఆత్మగౌరవం ఎక్కువ ప్రాధాన్యం కలిగివుంటుంది. గౌరవం లేకుండా ఏ పనినైనా సంతృప్తిగా అనుభూతి చెందలేం. కాబట్టి మనకు గౌరవం లేని చోట, కలిసి తినకుండా ఉండాలి.
వివరాలు
పైకి బాగానే మాట్లాడుతున్నా.. కొన్ని విషయాల్లో గౌరవం ఇవ్వరు
ముఖ్యంగా, కొందరు వ్యక్తులు మిమ్మల్ని అవమానిస్తూ, గౌరవం లేని ప్రవర్తనతో ఉంటే, వారు ఉన్న చోట అసలు ఉండకూడదు. ఆత్మగౌరవం ఎప్పటికీ ఆహారానికంటే ముఖ్యం. ఆహారం ప్రశాంత వాతావరణంలో, గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఆస్వాదించాలి. చాలామంది పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో గౌరవం ఇవ్వరు. ముఖ్యంగా కొన్ని గ్రూపులలో, కొందరు చిన్న చూపు చూపించడం లాంటివి చేసి,మనకు మానసికంగా ఇబ్బంది కలిగిస్తారు. ఇలాంటి వ్యక్తులు ఉన్న చోట వెళ్ళకూడదు. అవసరమైతే ఒంటరిగా ఉండటం మంచిది, కానీ ఇలాంటి గ్రూపులతో స్నేహం చేసుకోవడం మానసికంగా హానికరం .
వివరాలు
అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడం అత్యంత అవసరం
కొంతమంది మాటలతో తీవ్ర ఆవేదన కలిగిస్తారు. వారి మాటలు ఒక్కోసారి మనకు ప్రాణం పోయినట్లే అనిపిస్తాయి. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండడం అత్యంత అవసరం. ముఖ్యంగా, ఎదుటివారిని హేళన చేయడం, తక్కువ చేసి చూపడం చేసే వారితో స్నేహం చేస్తే జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.